సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు

విశాఖపట్నం వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభమైన సీఐఐ (CII) అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పారిశ్రామిక భవితను ఆవిష్కరించారు. దేశ విదేశాల నుంచి విచ్చేసిన పారిశ్రామిక దిగ్గజాలు, రాయబారులు, ప్రభుత్వ ప్రతినిధులను సాదరంగా ఆహ్వానిస్తూ సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా కేంద్ర గుర్తింపు పొందిన విశాఖ గడ్డపై, గిరిజన థింసా నృత్యాల సంస్కృతీ సంప్రదాయాల నడుమ ఈ వేడుక అట్టహాసంగా సాగుతోంది.

భవిష్యత్ రంగాలు.. ప్రత్యేక మిషన్లపై ఏపీ దృష్టి

పారిశ్రామిక ప్రతినిధులకు ప్రజెంటేషన్ ఇస్తూ.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు పలు కీలక రంగాళ్లను ప్రాధాన్యతాంశాలుగా గుర్తించినట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రేర్ ఎర్త్ మాగ్నెట్స్, స్టీల్ ఉత్పత్తి, సౌర ఇంధనం, బ్యాటరీ ఎనర్జీ రంగాల్లో ఏపీ ఇప్పటికే కీలక అడుగులు వేస్తోందన్నారు. క్రిటికల్ మినరల్ మిషన్, స్టీల్ పాలసీ, సోలార్ మిషన్, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత, స్పేస్ విజన్, సెమీకండక్టర్ మిషన్, లాజిస్టిక్స్ పాలసీ, క్వాంటం టెక్నాలజీ, గ్రీన్ హైడ్రోజన్, మారిటైమ్ మిషన్లను ప్రభుత్వం ప్రధానంగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

Vizag CII Summit Sees Naidu Invite Global Investors Highlighting Fast Track Approvals And Industrial Vision
ఏపీ రూపురేఖలు మార్చే తరుణం.. సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ సంబరాలు
ఏపీ రూపురేఖలు మార్చే తరుణం.. సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభోత్సవ సంబరాలు

క్వాంటం టెక్నాలజీ నుంచి డ్రోన్ సిటీ వరకు సరికొత్త ప్రణాళికలు

టెక్నాలజీ రంగంలో రాష్ట్రం దూసుకుపోతోందని చెబుతూ.. క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుతో పాటు క్వాంటం పరికరాలను ప్రత్యేకంగా 'మేడ్ ఇన్ అమరావతి' బ్రాండ్‌తో తయారు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. పౌర అవసరాలు, రక్షణ రంగానికి అవసరమైన డ్రోన్ల తయారీ కోసం భారీ స్థాయిలో 'డ్రోన్ సిటీ'ని ఏర్పాటు చేస్తున్నామని, ప్రస్తుతం మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారానే ప్రాణాలను రక్షించే ఔషధాలను రవాణా చేస్తున్నామని గుర్తుచేశారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికి హార్టీకల్చర్ హబ్‌గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

విశాఖలో రెడ్‌ జోన్‌.. డ్రోన్స్ బ్యాన్.. ఎందుకంటే!
విశాఖలో రెడ్‌ జోన్‌.. డ్రోన్స్ బ్యాన్.. ఎందుకంటే!

రికార్డు స్థాయిలో పెట్టుబడులు.. వేగవంతమైన అనుమతులు

పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా '12 ఎక్స్ స్పీడ్ ఆఫ్ అప్రూవల్స్' విధానం ద్వారా అత్యంత వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఇప్పటికే వివిధ రూపాల్లో కుదిరిన 303 ఒప్పందాల (MoUs) ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు రానుండగా, తాజా సీఐఐ భాగస్వామ్య సదస్సుతో కలుపుకుని మొత్తం రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులను ఏపీ సాధించిందని స్పష్టం చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల స్వర్గధామంగా మారుతోందని పారిశ్రామిక వర్గాలకు సీఎం భరోసా కల్పించారు.

ఏపీలో అనుసరించే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు కియా కార్ల యూనిట్ ఓ మంచి ఉదాహరణ. ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు కూడా కేవలం 36 రోజుల్లోనే అనుమతులు ఇచ్చి భూమి కేటాయించాం. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా కేవలం 19 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభించేందుకు రెడీగా ఉంది. ఇదీ అనుమతులను వేగంగా మంజూరు చేయడంలో ఏపీ ట్రాక్ రికార్డ్. బ్లూ గ్రీన్ సిటీగా అమరావతి రాజధాని నగరాన్ని నిర్మిస్తున్నాం. పూర్తి టెక్నాలజీ సాయంతో ఐకానిక్ భవనాలతో నగరాన్ని నిర్మాణం చేపడుతున్నాం. పారిశ్రామిక వేత్తలు అమరావతిని తమ రెండో నివాసంగా మార్చుకోవాలని కోరుతున్నాను. ఏపీలో ఉన్న 6 ఆపరేషనల్ పోర్టులు, ఎయిర్ పోర్టులు, హై స్పీడ్ రైలు నెట్వర్క్, రోడ్డు కనెక్టివిటీతో అత్యుత్తమ లాజిస్టిక్స్ ప్రాంతంగా ఉంది. రివర్ లింకింగ్ ద్వారా సాగు, తాగు నీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు నీరు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాం. గోదావరి కుడి, ఎడమ కాలువల ద్వారా విశాఖకు, అమరావతికి నీరు ఇవ్వడంతో పాటు, పొరుగు రాష్ట్రంలో ఉన్న కావేరీ నదీ కి నీరు తీసుకువెళ్లే అవకాశం ఉంది. గోదావరి కావేరీ లింక్ ద్వారా 5 రాష్ట్రాల దాహార్తి తీర్చే అవకాశం ఉంది. విద్యుత్ గ్రిడ్ లాగే వాటర్ గ్రిడ్ కూడా ఉంటే ప్రజలకు లబ్ది కలుగుతుంది. ఏపీలో 25 సెక్టోరల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. తిరుపతిని గ్లోబల్ సెమీకండక్టర్ చిప్ డిజైన్ క్యాపిటల్ గా తయారు చేస్తాం - సీఎం చంద్రబాబు నాయుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+