డ్రగ్స్ కేసులో దొరికిన నిందితులెవరు -నేరుగా లింకులు..!!

ఏపీలో ఎన్నికలవేళ కొత్త కలకలం మొదలైంది. విశాఖ కేంద్రంగా 25000 కిలోల డ్రగ్స్ పట్టుబడటం సంచలనంగా మారింది. వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. వైసిపి, టిడిపి నేతలు ఒకరి పైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే, పురందేశ్వరి తో పాటుగా టిడిపి ముఖ్యుల బంధువులతో డ్రగ్స్ లో దొరికిన వారికి సంబంధాలు ఉన్నాయని వైసిపి ఆరోపిస్తుంది.

బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వచ్చిన కంటైనర్ లో 25 వేల కిలోమీటర్స్ ను పట్టుకున్నారు. ఆపరేషన్ గరుడ లో భాగంగా సిబిఐ ఈ పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను సీజ్ చేసింది. ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ రంగంలోకి దిగి వీటిని స్వాధీనం చేసుకుంది. జర్మనీలోని హంపర్గ్ మీదుగా ఈనెల 16న కంటైనర్ విశాఖపట్నం గుర్తించారు. ఓ ప్రైవేట్ కంపెనీ 1000 బ్యాగుల్లో డ్రగ్స్ నింపి సరఫరా చేసినట్లు అధికారులు నిర్ధారించారు. విశాఖలో డెలివరీ ఇచ్చేలా ఈ బుకింగ్ బ్రెజిల్ లో బుక్ చేశారు.

Vizag drugs seize case leads to new political controversy in ap between YSRCP and TDP

సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి ఈ కన్జైన్మెంట్ అందుకోవాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ కంపెనీ డెలివరీ అడ్రస్ ఉండటంతో దీని ఆధారంగానే సిబిఐ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని తాము ఎలాంటి తప్పు చేయలేదని కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు ఇందులో బుక్ చేసింది కుక్క అయినా లేక రా మెటీరియల్ అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో టిడిపి సోషల్ మీడియా వేదికగా ఈ డ్రగ్స్ వెనక వైసీపీ నేతలు ఉన్నారని ప్రచారం చేస్తుంది.

దీనికి కౌంటర్ గా వైసీపీ నేతలు ఆ కంపెనీ ముఖ్య లతో టిడిపి నేతలకు ఉన్న సంబంధాలను బయట పెట్టింది. టిడిపి నేతలు దామచర్ల సత్య, లావు శ్రీకృష్ణదేవరాయలు,రాయపాటి జీవన్ తో నిందితుడిగా పేర్కొంటున్న కోటయ్య చౌదరికి సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తుంది. వైసిపి నేత సజ్జల ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న వారు పురందేశ్వరి కుటుంబ సభ్యులకు వ్యాపార భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు. దీంతో ఇప్పుడు ఈ కేసు వ్యవహారం ఎన్నికలవేళ రాజకీయ వివాదంగా మారుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+