ఇది కచ్చితంగా సంచలనమే!: మార్కుల్లో దుమ్ము రేపుతోన్న ట్విన్ సిస్టర్స్..

పదో తరగతిలోను ఇద్దరికి ఒకే మార్కులు రాగా.. తాజా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లోను మరోసారి అదే రిపీటైంది.

గోపాలపట్నం: తాజా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో విశాఖపట్నంలోని గోపాలపట్నంకు చెందిన ఇద్దరు ట్విన్ సిస్టర్స్ సత్తా చాటారు. పుట్టుకలోనే కాదు చదువులోను వీరిద్దరు సమవుజ్జీలుగా పోటీ పడుతున్నారు. చిన్న నాటి నుంచి ప్రతీ పరీక్షలో ఇద్దరికీ సమంగా మార్కులు రావడం ప్రతీ ఒక్కరిని ఆశ్చర్యపరిచేది.

పదో తరగతిలోను ఇద్దరికి ఒకే మార్కులు రాగా.. తాజా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లోను మరోసారి అదే రిపీటైంది. కవలల్లో ఒకరైన ఎన్.ధన్యశ్రీకి ఇంటర్మీడియట్ ఎంపీసీలో 97.1శాతం మార్కులు సంపాదించగా.. మరో ట్విన్ సిస్టర్ భవ్యశ్రీకి సైతం 97.1శాతం మార్కులే వచ్చాయి. పైగా వీరిద్దరు వేర్వేరు గ్రూపులు కావడం గమనార్హం.

vizag twin sisters got same marks in andrapradesh intermediate exams

మరో విశేషమేంటంటే సంస్కృతం సబ్జెక్టులో ఇద్దరికీ 98మార్కులే రావడం విశేషం. తమ ఇద్దరు బిడ్డలు ఇంతలా ప్రతిభ కనబర్చడాన్ని తల్లిదండ్రులు గర్వంగా ఫీలవుతున్నారు. కాగా, వీరి తల్లిదండ్రులు శివప్రసాదరావు, అమరవాణి ఇద్దరూ అధ్యాపకులే కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+