సీన్ రివర్స్ - వాలంటీర్ల సేవల పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. జగన్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల ప్రక్షాళన ప్రారంభించింది. వాలంటీర్ల వ్యవస్థలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాలంటీర్లను కొనసాగిస్తామని..రూ 10 వేల వేతనం చెల్లిస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. తాజాగా టీడీపీ నేతలను కలిసిన వాలంటీర్లు తమను కొనసాగించాలని కోరుతున్నారు. రాజీనామాలను వెనక్కు తీసుకుంటామని చెప్పారు.

వాలంటీర్లు వినతులు
వైసీపీ కోసం వాలంటీర్లు పని చేసారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో పెన్షన్ల పంపిణీ నుంచి ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెట్టింది. ఆ సమయంలో పలువురు వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేసి వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రాజీనామాలు చేసినవారంతా తిరిగి విధుల్లో చేరతామంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు వినతిపత్రాలిస్తున్నారు. వైసీపీ నేతలు బలవంతంగా తమతో రాజీనామాలు చేయించారని, తప్పైపోయిందని, తమని క్షమించాలని వేడుకుంటున్నారు. చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు పైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Volunteers meets TDP leaders asks for Continuation of Services in Govt schemes

కూటమి ప్రభుత్వం కసరత్తు
వాలంటీర్లకు కనీస విద్యార్హత ను నిర్ణయించి..విధుల్లో కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వైసీపీ ప్రభుత్వంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లకు తిరిగి అవకాశం ఇస్తారా లేదా అనేది కీలకంగా మారుతోంది. నాడు వైసీపీ కోసం రాజీనామా చేసిన వారు ఇప్పుడు తిరిగి విధుల్లో చేరేందుకు ముందుకు వస్తున్నారు. వీరి విషయంలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదే విధంగా వాలంటీర్లను గత ప్రభుత్వం పథకాల అమలు కోసం ప్రధానంగా వినియోగించుకుంది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వీరి సేవలను పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది.

Volunteers meets TDP leaders asks for Continuation of Services in Govt schemes

వారికి అనుమతి ఇచ్చేనా
ప్రస్తుతం వాలంటీర్లు స్వయంగా సేవలు అందించే అవకాశం ఇవ్వాలని ముందుకు వస్తున్నారు. తమ రాజీనామాలు వెనక్కు తీసుకుంటామని చెబుతున్నారు. దీంతో, టీడీపీ నేతలు ఈ అంశాన్ని పార్టీ నాయకత్వానికి నివేదిస్తున్నారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ కొనసాగించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, సచివాలయ వ్యవస్థ నిర్వహణ బాధ్యతలను మంత్రి డోలా బాల వీరాజంనేయ స్వామికి కేటాయించారు. ఇక..ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే, రాజీనామా చేసిన వారి విషయంలో నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+