వాలంటీర్ల పై తాజా అస్త్రం - మరో కీలక బాధ్యతల నుంచి దూరం..!!

ఏపీలో ఎన్నికలవేళ వాలంటీర్ల వ్యవహారం కీలకంగా మారుతుంది. ఇప్పటికే వాలంటీర్లు పెన్షన్ పంపిణీలో పాల్గొన వద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పుడు తాజాగా వాలంటీర్లను మరో కీలక బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వాలంటీర్లు, పెన్షన్ వ్యవహారంపై ఏపీలో రాజకీయంగా దుమారం మొదలైంది.

తాజా మార్గదర్శకాలు
ఎన్నికల సంఘం మార్గదర్శకాలు మేరకు అధికారులు తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వాలంటీర్లు ను పెన్షన్ల పంపిణీ నుంచి దూరంగా ఉండాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీచేశారు. లబ్ధిదారులు తమ పరిధిలోని సచివాలయంలో ఈనెల మూడో తేదీన పెన్షన్లు పొందాలని సూచించారు. తమ గుర్తింపు కార్డులతో సమీప సచివాలయంలో పెన్షన్ పొందవచ్చని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తాజాగా ఎన్నికల సంఘం సూచన మేరకు అధికారులు రేషన్ పంపిణీ వ్యవస్థలో దూరంగా ఉండాలని వాలంటీర్లకు ఆదేశాలు ఇచ్చారు.

Volunteers to away form public distribution system till the end of election code in AP Orders issues

వాలంటీర్ల కు పరిమితులు
ఏపీలో ఎన్నికల కోడ్ కారణంగా వాలంటీర్ల విధులపై పరిమితులు విధిస్తూ అధికారులు స్పష్టత ఇచ్చారు. వాలంటీర్ల పేరిట ఉన్న బయోమెట్రిక్ ఎన్ఐసీని నిలిపివేశారు. వారి స్థానాల్లో విఆర్వోలు మ్యాపింగ్ నిర్వహించనున్నారు. ఎక్కడైనా బయోమెట్రిక్ ఫెయిల్యూర్ కేసులు ఉంటే వీఆర్వో వెంటనే సరి చేయాలని నిర్దేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ఆపరేటర్లు కూడా సరఫరా సమయంలో వాలంటీలను పిలవద్దని సూచించారు. ఇప్పటికే వాలంటీర్ల వద్ద ఉన్న ట్యాబులు, సిమ్ కార్డులను అధికారులకు అందించారు. ప్రతినెల మొదటి నాలుగు రోజుల్లో లబ్ధిదారుల నివాసాల వద్దకు రేషన్ వాహనాలు వెళ్లి ప్రజా పంపిణీ అమలు చేస్తున్నారు.

ప్రజా పంపిణీ కి దూరం
ఈ మధ్యకాలంలోనే ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ పర్యవేక్షణ బాధ్యతలను వాలంటీర్లకు అప్పగించింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం సూచనల మేరకు తాజాగా ఈ బాధ్యతల నుంచి పక్కనబెడుతూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వరుసగా మూడు నెలలపాటు వాలంటీర్లు అటు పెన్షన్ పంపిణీ తో పాటుగా, ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి దూరంగా అధికారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో పెన్షన్ పంపిణీ నుండి వాలంటీలను దూరం చేయటంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం చెలరేగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+