ఓటర్లకు తెలియకుండానే ఓట్ల తొలిగింపు: ఈసీకి దరఖాస్తులు: 45 మంది పై క్రిమినల్ కేసులు..!
ఏపిలో ఎన్నికల వేళ..భారీగా ఓట్ల తొలిగింపు పై రచ్చ జరుగుతోంది.ప్రత్యర్ధి పార్టీలే ఓట్ల తొలిగింపుకు దిగుతున్నాయం టూ అధికార - ప్రతిపక్ష పార్టీలు ఒకరి పై మరొకరు ఫిర్యాదులు..ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ప్రజల్లో తమ ఓట్ల పై అనుమానాలు పెరుగుతున్న సమయంలో ఎన్నికల సంఘం దీని పై దృష్టి సారించింది. మోసపూరితంగా ఓట్ల తొలిగింపు పై దరఖాస్తు చేసిన వారిని గుర్తించే పని ప్రారంభించింది. ఇప్పటి వరకు 45 మంది కేసులు నమోదు చేసింది.
45 క్రిమినల్ కేసులు నమోదు..
ఓటర్లకు తెలియకుండానే ఓట్ల తొలగింపు కోసం వారి పేరిట మోసపూరితంగా ఆన్‌లైన్‌లో ఫారం-7 దరఖాస్తులు చేసిన వారిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 45 క్రిమినల్ కేసులు నమోదు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 14 కేసులు పెట్టామని, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల్లో చెరో 8 కేసులు, ప్రకాశంలో నాలుగు, శ్రీకాకుళం, కృష్ణా, చిత్తూరుల్లో చెరో మూడు కేసులు, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు చేశామని వివరించారు. దురుద్దేశపూరితంగా ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు చేయటం అనుచిత, అక్రమ చర్య అని, దీన్ని తీవ్రంగా నిరోధించాలని అన్నారు. ఫిర్యాదులపై విచారణ జరిపిన తర్వాతే కేసులు పెట్టామన్నారు.

మీ సేవ సిబ్బంది పాత్ర..
మోసపూరితంగా దరఖాస్తులు చేసిన ఘటనల్లో ప్రమేయమున్న ఆరుగురు మీ సేవ సిబ్బందిపై తూర్పుగోదావరి జిల్లా కలె క్టర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. పలు జిల్లాల్లో వేల సంఖ్యలో ఓట్ల తొలిగింపు దరఖాస్తులు రావటంతో ఒక్క సారిగా అధికారులు విస్తుపోయారు. కడప జిల్లాలో మాజీ మంత్రి..సీనియర్ రాజకీయ నేత అయిన వైయస్ వివేకానంద రెడ్డి తన ఓటు తొలిగించమంటూ అభ్యర్ధిస్తున్నట్లుగా ఓ దరఖాస్తు వచ్చింది. దీంతో..వైసిపి నేతలు దీని పై నేరుగా ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. దీని పై విచారణ ప్రారంభించారు. ఎన్నికల సంఘానికి ఫారం-7 దరఖాస్తులు ఎక్కడి నుం డి వస్తున్నాయనే అంశం పై దృష్టి సారించారు. ఇప్పటికే సాంకేతికంగానూ సహకారం తీసుకుంటున్నారు. దరఖాస్తు లు వచ్చిన ఐపి చిరునామాల ఆధారంగా అక్రమంగా దరఖాస్తు చేసిన వారిని గుర్తించే ప్రక్రియ ప్రారంభించారు.
ఎవరి పేరు తొలిగించం..
ఈ నకిలీ దరఖాస్తుల ఆధారంగా జాబితా నుంచి ఎవరి పేరు కూడా తొలగించబోమని, పూర్తి విచారణ జరుపుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ స్పష్టం చేసారు. పారం -7 దరఖాస్తు వచ్చిన తరువాత దాని పై బిఎల్ఓ విచార ణ చేస్తారని..అక్కడి నుండి కలెక్టర్ స్థాయిలో మరో సారి ఖరారు చేసుకున్న తరువాత దాని పై ఎన్నికల సంఘం నిర్ణ యం తీసుకుంటుందని ద్వివేదీ చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు వేల సంఖ్యలో వస్తున్న దరఖాస్తుల పై తాము క్షేత్ర స్థాయిలోనూ...సాంకేతికంగానూ విచారణ చేస్తున్నామని..ఏ ఒక్కరి ఓటు తొలిగించమని అభయమిస్తున్నారు.












Click it and Unblock the Notifications