షాకింగ్ : వాట్సాప్ ఆన్‌లైన్ క్లాసుల గ్రూపులో అశ్లీల వీడియో...

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ఓ పాఠశాల బాలికల వాట్సాప్ గ్రూపులో అశ్లీల వీడియో కలకలం రేపింది. ఆన్‌లైన్ క్లాసుల కోసం ఏర్పాటు చేసిన గ్రూపులో అశ్లీల వీడియో ప్రత్యక్షమవడంతో విద్యార్థినులు షాక్ తిన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థి నాయకులు ఎంఈవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

వివరాల్లోకి వెళ్తే... కర్నూలు జిల్లాలోని పత్తికొండ ప్రభుత్వ బాలికల హైస్కూల్ పాఠశాల విద్యార్థినులకు ఆన్‌లైన్ తరగతుల కోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఎనిమిదో తరగతి విద్యార్థినులకు చెందిన ఆ గ్రూపులో ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి అశ్లీల వీడియోని పోస్టు చేశారు.

vulgar video shared in school WhatsApp group in kurnool

అదే గ్రూపులో ఆ వీడియో రెండు రోజుల పాటు అలాగే ఉంది. ఉపాధ్యాయులు కూడా దాన్ని పట్టించుకోకపోవడం,ఎవరూ దాన్ని తొలగించకపోడంతో విద్యార్థినులు పలువురు విద్యార్థి సంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఎంఈవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆ వీడియో పోస్టు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు ఎంఈవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నట్లు సమాచారం.

Recommended Video

    Bigg Boss Telugu 4 : Nagarjuna's Triple Role Promo Viral బిగ్ బాస్ షో రేంజ్ పెరిగేలా !

    కొద్ది నెలల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలినూ ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. పాఠశాల బాలికల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ ఆన్‌లైన్ క్లాసుల గ్రూపులో అశ్లీల వీడియో ప్రత్యక్షమైంది. దీనిపై స్వయంగా ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో షేర్ చేసిన నంబర్స్‌ని గుర్తించి ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+