కత్తి మహేష్‌దే పై చేయి, పవన్‌‌ దారిదే, ఏపీలో జనసేన కీలకమే: ఉండవల్లి సంచలనం

Recommended Video

    కత్తి మహేష్‌దే పై చేయి.. పవన్‌‌ దారిదే.. ఉండవల్లి సంచలనం..!

    అమరావతి: రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఏపీ రాష్ట్రంలో బలోపేతమయ్యే అవకాశం ఉందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్‌ విషయంలో సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ చేస్తున్న ఆరోపణల విషయంలో పవన్ స్పందంచకుంటేనే ప్రయోజనం ఉంటుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

    ఇటీవల కాలంలో సినీ విమర్శకులు కత్తి మహేష్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న విమర్శలపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ స్పందించారు. రాజకీయాల్లో ఉన్న నేతలు చాలా సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

    ఓ తెలుగు ఛానెల్ ప్రస్తుత పరిణామాలపై ఉండవల్లి అరుణ్‌కుమార్ ‌ను ఇంటర్వ్యూ చేసిన సమయంలో అరుణ్‌కుమార్ ఈ విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

     ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన బలోపేతం

    ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన బలోపేతం

    పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఏపీ రాష్ట్రంలో ఓ పోర్స్‌గా తయారయ్యే అవకాశం ఉందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై తనకు అనుమానం లేదన్నారు. అయితే పార్టీని నిలబెట్టుకోవడం పవన్ చేతుల్లో ఉంటుందన్నారు. అయితే ఆ విషయంలో వపన్ కళ్యాణ్ ఏ మేరకు విజయం సాధిస్తారో చూడాల్సిన అవసరం ఉందని అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

     కత్తి మహేష్ వివాదంపై

    కత్తి మహేష్ వివాదంపై

    సినీ విమర్శకుడు కత్తి మహేష్ వివాదం విషయమై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. పవన్ కళ్యాణ్ విషయంలో తొలుత కత్లి మహేష్ విమర్శలు చేసిన సమయంలో కొంత అర్ధవంతంగా ఉన్నప్పటికీ తర్వాత కాలంలో రొటీన్‌గా మారిందని ఉండవల్లి అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. అయితే కత్తి మహేష్ తన వాదనను అద్భుతంగా సమర్థించుకొంటారని చెప్పారు. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడంలో కత్తి మహేష్ కొంత స్కోర్ చేసినట్టు కన్పిస్తోందన్నారు.ఈ తరహ విమర్శల విషయంలో మౌనంగా ఉండడమే పవన్ కళ్యాణ్‌కు ఉత్తమమని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

     రాజకీయాల్లో సంయమనం పాటించాలి

    రాజకీయాల్లో సంయమనం పాటించాలి

    రాజకీయాల్లో ఉన్న నేతలంతా సంయమనం పాటించాల్సిందేనని ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు. రాజకీయాల్లోకి వచ్చిన వారిని ఇరిటేట్ చేసేందుకు ప్రయత్నించేవారు ఉంటారని ఉండవల్లి గుర్తు చేశారు. అయితే అన్నింటిని జాగ్రత్తగా గమనిస్తూ అవసరమైన వాటికే స్పందించాల్సిన అవసరం ఉందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. కత్తి మహేష్ విమర్శలపై పవన్ అభిమానులు మాట్లాడుతున్నారని. పవన్ మాట్లాడని విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తావించారు.సంయమనం పాటించడం వల్లే ప్రయోజనం ఉంటుందన్నారు.

    తటస్థ ఓటర్లను ఆకట్టుకోవాలి

    తటస్థ ఓటర్లను ఆకట్టుకోవాలి

    తటస్థ ఓటర్లను ఆకట్టుకోవాలని అప్పుడే రాజకీయాల్లో సక్సెస్ అవుతారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ప్రధాన పార్టీలకు చెందిన మద్దతుదారులు, సానుభూతి పరులను వదిలేసి తటస్థ ఓటర్లను ఆకట్టుకొంటేనే రాజకీయాల్లో సక్సెస్ అవుతారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+