షాకింగ్ : మరో వివాదంలో ఏపీ ఎన్నికలు ! రొడ్డున పడ్డ వీవీప్యాట్ స్లిప్పులు ..!
ఇక వైపు ఎన్నికల నిర్వహణ పై అనుమానాలు వ్యక్తం అవుతుంటే..మరో వైపు వివి స్లిప్పులు ఓ పాఠశాల వద్ద దొరకటం కలకలం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన పై రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి. ఎన్నికల నిర్వ హణ లో ఎన్నికల సంఘం విఫలమైందంటూ టిడిపి అధినేత చంద్రబాబు మూడు రోజులుగా ధ్వజమెత్తుతున్నారు. ఈ సమయంలోనే ఇలా వీవీ ప్యాట్స్ స్లిప్పులు దొరకటం పై విచారణ ప్రారంభమైంది..
ఆత్మకూరు లో కలకలం..
నెల్లూరు జిల్లా ఆత్మకూరు లోని ఓ ప్రభుత్వ పాఠశాల లో ఈవీయం లతో పాటుగా ఉండే వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికిన ఘట న కలకలం సృష్టించింది. ఎన్నికల్లో ఇవియం లో వేసిన ఓటు ఎవరికి వేసామో మరో సారి చెక్ చేసుకొనేందుకు వీలుగా ఈ వీవీ ప్యాట్స్ ను ఏర్పాటు చేసారు. ఆత్మకూరు పాఠశాల ప్రాంగనంలో దాదాపు 200 కు పైగా వీవీ ప్యాట్ స్లిప్పులు విద్యార్దుల కు దొరికాయి. వెంటనే స్థానిక రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించారు.
అక్కడకు వెళ్లిన ఆర్వో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్లిప్పులు పోలింగ్ సిబ్బందికి ఈవీఎం ల వినియోగానికి సంబంధించి శిక్షణ ఇచ్చిన సమయంలో విని యోగించిన స్లిప్పులు గా రిటర్నింగ్ అధికారి గుర్తించారు. అయితే, నిబంధనలు ప్రకారం శిక్షణ ఇచ్చిన సమయంలో వాడి న వీవీ ప్యాట్ స్లిప్పులను సైతం భద్రపర్చాల్సి ఉంటుంది. దీంతో..ఇలా ఓ పాఠశాలలో వీవీ ప్యాట్స్ స్లిప్పులు దొరకటం పై వివరణ కోరటంతో పాటుగా విచారణ చేపడతామని కలెక్టర్ స్పష్టం చేసారు.

ఎన్నికల సంఘం పై ఆగ్రహం..
ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలు ఎన్నికల సంఘం విషయంలో రెండు గా వ్యవహరిస్తున్నాయి. టిడిపి అధినేత చంద్ర బాబు పోలింగ్ ముందు రోజు నుండి ఎన్నికల సంఘాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఎన్నికల సంఘం తీసుకున్న అధి కారు ల బదిలీ నిర్ణయాల నుండి.. ఇవియం ల సమస్యల వరకు అన్నింటిలోనూ ఎన్నికల సంఘం తీరును తప్పు బడుతున్నా రు. ఎన్నికల సంఘం ఇవియం లను సక్రమంగా నిర్వహించకుండా ఓటర్లను యాచకులుగా చూస్తుందం టూ విరుచుకు పడ్డారు. ఇదే సమయంలో వీవీ ప్యాట్స్ ను 50 శాతం మేర లెక్కించాలని డిమాండ్ చేసారు. దీని కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ఇక, వైసిపి మాత్రం ఎన్నికల సంఘం సమర్ధవంతంగా పని చేసిందని కితాబిస్తున్నారు. ఎన్నికల సంఘం సమర్దవంతంగా పని చేయటం వలనే భారీ స్థాయిలో పోలింగ్ జరిగింద ని వైసిపి నేతలు చెబుతున్నారు. సరిగ్గా ఎన్నికల నిర్వహణ పై వివాదం సాగుతున్న ఈ సమయంలో ఆత్మకూరు లో బయట పడిన వీవీ ప్యాట్స్ స్లిప్పుల వ్యవహారం పై మరింగ రగడ సాగే అవకాశం కనపిస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications