నిష్పాక్షిక‌ విచార‌ణ జ‌ర‌గాలి: జ‌గ‌న్ సీయం కావాల‌ని : వివేకా కుమార్తె సునీత‌..!

త‌న తండ్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య పై నిష్ప‌క్ష‌పాత విచార‌ణ జ‌ర‌గాల‌ని వివేకా కుమార్తె సునీత కోరారు. వివేకా హ‌త్య పై వ‌స్తున్న ర‌క‌ర‌కాల ప్ర‌చారాల పై ఆవేద‌న వ్య‌క్తం చేసారు. సిట్ విచారణ పై ప్ర‌భావం ప‌డేలా కొంద‌రు పెద్ద‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. త‌మ‌ది పెద్ద కుటుంబం అని..చిన్న‌ప‌టి బేదాభిప్రాయాలు ఉన్నా..అంద‌రం క‌లిసే ఉంటామ‌ని చెప్పుకొచ్చారు. జ‌గ‌న్ ను సీయం చూడ‌ట‌మే వివేకా ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు.

నాన్న ను క్రూరంగా చంపారు..

నాన్న ను క్రూరంగా చంపారు..

వైయ‌స్ వివేకానంద‌రెడ్డి కుమార్తె సునీత మీడియా ముందుకొచ్చారు. మ‌ర‌ణించిన వారిని గౌర‌వించాల‌నే స్పృహ లే కుండా ర‌క‌ర‌కాల ప్ర‌చారం చేస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసారు. వివేకా కు పులివెందుల అన్నా..అక్క‌డి ప్ర‌జ‌లం టే చాలా ఇష్ట‌మ‌ని చెప్పుకొచ్చారు. త‌న త‌ల్లికి ఆరోగ్యం బాగా లేక‌పోవ‌టంతో త‌న వ‌ద్దే ఉంటుంద‌ని..తండ్రి వివేకా ఒం ట‌రిగా ఉంటున్నార‌ని వివ‌రించారు. ఆయ‌న్ను అంద‌రూ బాగా చూసుకున్నార‌ని..త‌న తండ్రిని ప్రేమించ‌లేని వారు ఎవ‌రూ ఉండ‌ర‌న్నారు. అటువంటి వ్య‌క్తిని క్రూరంగా చంపేసారంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. మ‌ర‌ణించిన వ్య‌క్తి పై వ్యాఖ్య‌లు స‌రి కాద‌ని..దీని పై పెద్ద‌లు ఇష్టానుసారం వ్యాఖ్య‌లు చేయ‌టం బాధాక‌ర‌మ‌న్నారు.

నిష్ప‌క్ష పాతంగా విచార‌ణ సాగాలి..

నిష్ప‌క్ష పాతంగా విచార‌ణ సాగాలి..

సిబిఐ విచార‌ణ అయినా మ‌రే విచార‌ణ అయినా నిష్ప‌క్ష‌పాతంగా సాగాల‌ని తాను కోరుకుంటున్నాన‌ని సునీత స్ప‌ష్టం చేసారు. సిట్ కంటే పైన ఉండే కొంద‌రు చేస్తున్న వ్యాఖ్య‌లు విచార‌ణ పై ప్ర‌భావం చూప‌వా అని ప్ర‌శ్నించారు. ఇంత కిరాత‌కం ఎవ‌రు చేసారో వారిని గుర్తించాల‌ని కోరారు. సిట్ విచార‌ణ పూర్తి కాకుండానే కొంద‌రు పెద్ద‌లు హ‌త్య పై వారి పైనా..వీరి పైనా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని..ఇది విచార‌ణ పై ప్రభావం చూపిస్తుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. అధికా రం లో ఉన్న వారు ఇలా చేస్తే ఖ‌చ్చితంగా సిట్ విచార‌ణ పై ప్రభావం ప‌డుతుంద‌న్నారు. మ‌ర‌ణించిన వ్య‌క్తి పైన గౌర‌వం లేకుండా ఇటువంటి ప్ర‌చారం చేయ‌టం కుమార్తె గా తాను జీర్ణించుకో లేక పోతున్నాన‌ని ఆవేద‌న చెందారు. దీని పై పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌రిగేలా..నిష్పాక్ష‌పాతంగా సాగేలా స‌హ‌క‌రించాల‌ని అభ్య‌ర్దించారు.

లేఖ విష‌యం ఫోరెన్సిక్ చూస్తుంది..

లేఖ విష‌యం ఫోరెన్సిక్ చూస్తుంది..

త‌మ కుటుంబంలో మొత్తం 700 మంది స‌భ్యులం ఉన్నామ‌ని..తామంతా ఏడాదికి ఒక సారి క‌లుస్తామ‌ని సునీత చెప్పు కొచ్చారు. ఇంత మంది ఉన్న చోట చిన్న‌పాటి బేదాభిప్రాయాలు ఉంటాయ‌ని..అయినా, ఆము ఒక‌రితో మ‌రొక‌రం గౌర‌వ భావంతో ఉంటామ‌ని వివ‌రించారు. వివేకా లేఖ రాసినట్లుగా చూపిస్తున్న లేఖ లోని ద‌స్తూరి ఆయ‌నేదానా కాదా అనేది ఫోరెన్సిక్ విచార‌ణ లో తేలుతుంద‌న్నారు. ఒక, వివేకా మృత దేహం చూసిన త‌రువాత అందరూ షాక్ కు గుర య్యార‌ని..ఆ స‌మ‌యంలో కుటుంబ స‌భ్యులు..శ్రేయోభిలాషులు చాలా మంది ఉన్నార‌ని వివ‌రించారు. అయ‌తే, ఆ స‌యంలో జ‌రిగిన‌వి ఉద్దేశ పూర్వ‌క‌మా..లేక యాధృచ్చిక‌మా అన్న‌ది విచార‌ణ‌లో తేలుతుంద‌న్నారు. విచార‌ణ ను ప్ర‌భావితం చేయ‌కుండా స‌జావుగా విచార‌ణ జ‌ర‌గాల‌ని కోరారు. జ‌గ‌న్ ను ముఖ్య‌మంత్రి చేయ‌ట‌మే వివేకా ల‌క్ష్యామ‌ని సునీత పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+