ఏపీలో ఇసుక ఉచితమా కాదా ? వైసీపీ, టీడీపీ వార్ ! వాస్తవం ఇదే..!

ఏపీలో ఇసుకను ఉచితంగా పంపిణీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం నిన్న మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో ర్యాంపుల నిర్వహణకు సీనరేజ్ ఛార్జీలు, లోడింగ్, అన్ లోడింగ్, రవాణా ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఆన్ లైన్లో నిన్నటి నుంచి ఇసుక కొనుగోళ్లకు అనుమతించారు. ఇప్పటికే లోడింగ్ పాయింట్ల వద్ద ఉన్న ఇసుకను విక్రయించేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే ఉచితం అని చెప్పుకుంటూ 500 నుంచి 1300 వరకూ వసూలు చేస్తున్నారంటూ విపక్ష వైసీపీ ఆరోపణలు ఎక్కుపెడుతోంది.

రాష్ట్రంలో నిన్న అమల్లోకి వచ్చిన తాత్కాలిక ఇసుక విధానం ప్రకారం ప్రభుత్వం ఎలాంటి రాబడి లేకుండా కేవలం నిర్వహణ ఖర్చుల కోసమే ఇసుకకు ఛార్జీలు వసూలు చేస్తోంది. ఈ ఛార్జీలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో విధంగా ఉన్నాయి. ర్యాంపులు దగ్గరగా ఉన్న చోట ఒకలా, దూరంగా ఉన్నచోట మరోలా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం ఉచిత ఇసుక అని చెప్పి ఛార్జీలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఈ మేరకు ఉచిత నాటకం అంటూ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టింది.

war of words of between ysrcp tdp over free sand policy- here is fact

దీనికి అధికార టీడీపీ కూడా ఘాటు కౌంటర్ ఇచ్చింది. అవును ఇసుక ఫ్రీనే, రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తూ నిన్ను (జగన్) అసెంబ్లీలో మొదటి బెంచీలో కూర్చోబెట్టమని బాబు గారెకి(చంద్రబాబు)రిఫర్ చేస్తామంటూ కౌంటర్ ఇచ్చింది. ఉచిత ఇసుక పై తప్పుడు ప్రచారం చేస్తే మీకే నష్టమని, తీసుకునే వాళ్లకు అసలు విషయం తెలుసని టీడీపీ పేర్కొంది. అలాగే ఉచిత ఇసుక అనేది 2019కి ముందు ఉన్న విధానామే అని స్పష్టం చేస్తోంది.

ఇందులో వాస్తవాలు గమనిస్తే.. ప్రభుత్వం మైనింగ్ శాఖ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్న ప్రకారం చూస్తే ర్యాంపుల దూరాన్ని బట్టి ఛార్జీలు ఉన్నట్లు అర్దమవుతోంది. సీనరేజ్, పన్నులు, రవాణాకు మాత్రమే ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇసుకకు ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలు లేవు. అయితే ఇది తాత్కాలిక విధానమే కాబట్టి పూర్తి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వస్తే పరిస్ధితి ఎలా ఉంటుందో చూడాల్సి ఉందని నిపుణులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+