వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Chandrababu: వార్ వన్ సైడే.. నోడౌట్!! నేతల్లో స్ఫూర్తిని నింపుతున్న చంద్రబాబునాయుడు

|
Google Oneindia TeluguNews

రాబోయే ఎన్నిక‌ల్లో వార్ వ‌న్‌సైడ్ అవుతుంద‌ని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు స్ప‌ష్టం చేస్తున్నారు. మ‌హానాడుకు వ‌చ్చిన స్పందన చూసిన త‌ర్వాత అంటున్న మాట కాద‌ని, అంత‌కుముందే "బాదుడే బాదుడు" కార్య‌క్ర‌మానికి రాయ‌ల‌సీమ‌లో వ‌చ్చిన స్పంద‌న చూసి చెబుతున్న మాట అని తెలుగుదేశం పార్టీ నాయ‌కులంటున్నారు. మ‌హానాడుకు భారీసంఖ్య‌లో త‌ర‌లి వ‌చ్చిన ప్ర‌జ‌లు "బాదుడే బాదుడు"కు ఒక బూస్ట‌ప్ లాంటిద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

ప్ర‌భుత్వం పెడుతున్న కేసులే క‌సిని పెంచాయి

ప్ర‌భుత్వం పెడుతున్న కేసులే క‌సిని పెంచాయి

రాష్ట్ర‌వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై వైసీపీ ప్ర‌భుత్వం పెడుతున్న కేసులు టీడీపీ శ్రేణుల్లో ఒక క‌సిని పెంచాయ‌ని, ఆ క‌సే ప‌ట్టుద‌ల‌గా మ‌హానాడుకు తీసుకువ‌చ్చింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. గ‌తంలో ఏ ప్ర‌భుత్వంపైనా ఇంత అసంతృప్తిని తాను ప్ర‌జ‌ల్లో చూడ‌లేద‌ని చంద్ర‌బాబు అంటున్నారు. అందుకే పార్టీ కార్య‌క్ర‌మాల్లోను, మీడియా స‌మావేశాల్లోను చంద్ర‌బాబు పూర్తిస్థాయి ఆత్మ‌విశ్వాసంతో క‌న‌ప‌డుతున్నారు.

జ‌న‌సేన‌తో దాదాపుగా పొత్తు ఖాయ‌మైన‌ట్లే!!

జ‌న‌సేన‌తో దాదాపుగా పొత్తు ఖాయ‌మైన‌ట్లే!!

జ‌న‌సేన పార్టీతో పొత్తు కూడా దాదాపుగా ఖాయ‌మైన‌ట్లేన‌ని, అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పార్టీల‌తో పొత్తు గురించి ముందే మాట్లాడితే శ్రేణుల‌కు, ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయ‌ని, అందుకే ఇప్పుడే ఆ విష‌యాన్ని బ‌య‌ట పెట్ట‌డం స‌రైన స్ట్రాట‌జీ కాద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అందుకే ఆయ‌న మ‌హానాడులో పొత్తుల విష‌యం గురించి మాట్లాడ‌లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

మ‌హానాడుకు ముందు.. మ‌హానాడు త‌ర్వాత‌

మ‌హానాడుకు ముందు.. మ‌హానాడు త‌ర్వాత‌

మ‌హానాడుకు ముందు, మ‌హానాడు త‌ర్వాత చంద్ర‌బాబునాయుడు పార్టీల నాయ‌కుల‌తో జిల్లాల వారీగా వ‌రుస‌గా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి రావాల‌న్నా కోస్తా జిల్లాలు ప్ర‌ముఖ పాత్ర పోషిస్తున్నాయ‌ని, గ‌త ప్ర‌భుత్వ ఏర్పాటులో ఇవి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాయ‌ని, ఈసారి ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలు ఎటువైపు కొమ్ముకాస్తాయో అన్న‌దానిపై పార్టీ విజ‌యం ఆధార‌ప‌డివుంటుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

అంతేకాకుండా రాయ‌ల‌సీమ జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఒక్క‌సారిగా ఆద‌ర‌ణ పెరిగింద‌ని, అందుకు రుజువే "బాదుడే బాదుడు" కార్య‌క్ర‌మ‌మ‌ని నాయ‌కుల‌కు వివ‌రించి చెబుతూ బాగా ప‌నిచేయాల‌ని ఉద్భోదిస్తున్నారు. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను ఓట్ల‌రూపంలో మ‌లుచుకోగ‌లిగితే భారీ విజ‌యం ఖాయ‌మ‌ని, ఆ దిశ‌గా నేత‌లంతా క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌ని, తాను అందుకు మార్గ‌ద‌ర్శిగా ఉంటాన‌ని బాబు వారిలో ఆత్మ‌విశ్వాసాన్ని నింపుతున్నారు.

English summary
Chandrababu Naidu instills confidence in leaders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X