శిల్పా చొక్కా పట్టుకొని: అఖిల తీవ్రవ్యాఖ్యలు, బాబు ఇంట్లో నుంచి తెచ్చావా: శిల్పా
నంద్యాల ఉప ఎన్నికల్లో మంత్రి భూమా అఖిలప్రియ, వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది.బుధవారం ఇరువురు నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగారు.
నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో మంత్రి భూమా అఖిలప్రియ, వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బుధవారం ఇరువురు నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగారు.

శిల్పా చొక్కా పట్టుకొని నిలదీయాలి, కౌంట్ డౌన్ మొదలు
శిల్పా మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వస్తే చొక్కా పట్టుకొని ప్రజలు నిలదీయాలని మంత్రి భూమా అఖిలప్రియ బుధవారం అన్నారు. భూమా నాగిరెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. శిల్పా మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలు అయిందన్నారు. ఇన్నాళ్లు నంద్యాలకు ఏం చేశావని శిల్పా మోహన్ రెడ్డిని ప్రజలు నిలదీయాలన్నారు.
Recommended Video


రూ.1200 కోట్లు ఇచ్చామన్నారే..
టిడిపి తమపై అసత్య ప్రచారం చేస్తోందని ఆవేదన శిల్పా మోహన్ రెడ్డి వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విషప్రచారం సరికాదన్నారు. నంద్యాల అభివృద్ధికి రూ.1200 కోట్లు ఇచ్చామని చెబుతున్నారే తప్ప, ఇవ్వలేదన్నారు. ముస్లీంలపై కేసులు పెట్టించానని, తనకు వారి మద్దతు ఉండదని కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

చంద్రబాబు ఇంట్లో డబ్బులా
వైసిపి గెలిస్తే నంద్యాల అభివృద్ధి ఆగిపోతుందని టిడిపి విషప్రచారం చేస్తోందన్నారు. అభివృద్ధి కోసం డబ్బులు ఏమైనా చంద్రబాబు ఇంట్లో నుంచి తీసుకు వచ్చి పెడుతున్నారా అని శిల్పా మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నంద్యాల అభివృద్ధికి టిడిపి చేసిందేమీ లేదన్నారు.

ఇలా వైసిపి జెండా ఎగురుతుంది
వైసిపి అండ, శిల్పా సోదరులకు నంద్యాలలో ఉన్న మద్దతు, జగన్‌కు ఉన్న ఫాలోయింగ్.. ఇవన్నీ కలిసి నంద్యాలలో వైసిపి జెండా ఎగురుతుందని శిల్పా మోహన్ రెడ్డి చెప్పారు. టిడిపికి నంద్యాల ప్రజలు గుణణపాఠం చెబుతారన్నారు. కర్నూలులో వైసిపి మరింత బలోపంతమవుతుందని, 2019లో వైసిపి 14 స్థానాలు గెలుచుకుంటుందన్నారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications