సీనియర్ల పైశాచికానికే వరంగల్ విద్యార్థిని బలి: అర్ధనగ్నంగా తిప్పి, వీడియో తీశారు?

గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో వరంగల్‌కు విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో సీనియర్ల పైశాచికాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న రిషికేశ్వరి చిన్నచిన్న వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని యూనివర్శిటీ అధ్యాపకులు, విద్యార్థులు చెబుతున్నప్పటికీ అసలు కారణం అవికాదనే వాదనలు బలంగా విన్పిస్తున్నాయి.

పోలీసులు కూడా మొదట ర్యాగింగ్ కాదని చెప్పినప్పటికీ.. వారి దర్యాప్తు ఆ కోణంలోనే కొనసాగుతోంది. రిషికేశ్వరి ది లాస్ట్ నోట్ పేరుతో రాసిన సూసైడ్ నోట్‌ను చదివి చలించిపోయిన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం ఇది ర్యాగింగేనని తేల్చి చెప్పారు. యూనివర్శిటీలో ర్యాగింగ్‌లేదని ఏ అమ్మాయి అనుకోవద్దని ఇక్కడ నరకప్రాయంగా మారిందని రిషికేశ్వరి తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.

కాగా, మంత్రి గంటా ఆదేశాలతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు దిగ్ర్భాంతికర విషయాలు బహిర్గతమైనట్లు సమాచారం. రిషికేశ్వరికి మొదటి నుంచి డైరీ రాయడం అలవాటు కావడంతో కళాశాలలో ఆమెకు బాధ కలిగించిన ప్రతి సంఘటననూ అందులో రాసుకుంది. ఈ డైరీ ద్వారా విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటికి ముగ్గురు సీనియర్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఘటన కావడం, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఉండటంతో పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది కాకుండా యూనివర్శిటీలో ఓ కమిటీని నియమించి వారంలో నివేదిక ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది.

 Warangal student suicide due to seniors harassment

అర్ధనగ్నంగా తిప్పి.. వీడియోలు తీశారు, అపై సెల్‌ఫోన్లలో షేర్ చేసుకున్నారు

కాగా, రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకునే ముందురోజు (జులై13వ తేదీ) రాత్రి మంగళగిరిలోని ఓ సినిమా థియేటర్‌లో ఫస్ట్‌షో సినిమాకు వెళ్లినట్లు విద్యార్థులు చెబుతున్నారు. థియేటర్‌లో ఓ సీనియర్ విద్యార్థి రిషికేశ్వరి నడుంపై చేయివేసి అసభ్యంగా ప్రవర్తించడంతో తట్టుకోలేక సినిమా నుంచి మధ్యలోనే హాస్టల్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.

సినిమా అయిపోయి హాస్టల్‌కు చేరుకున్న ఓ సీనియర్ విద్యార్థిని అబ్బాయిలు ఇచ్చిన ఆదేశాల మేరకు రిషికేశ్వరిని అర్ధనగ్నంగా హాస్టల్‌లో తిరగాలని, సీనియర్‌ల మాట విననందుకు ఇది పనిష్మెంట్‌గా చెప్పిందని విద్యార్థులు చెప్పుకుంటున్నారు. సీనియర్ మాట వినకుంటే మరిన్ని ఇబ్బందులు వస్తాయనే బాధతో రిషికేశ్వరి అర్ధనగ్నంగా తిరిగిందని విద్యార్థులు చర్చించుకుంటున్నారు.

అంతటితో ఆగకుండా, ఈ దృశ్యాలను వీడియో తీసిన ఆ సీనియర్ విద్యార్థిని తాను రిషికేశ్వరికి పనిష్మెంట్ ఇచ్చినట్లుగా నమ్మించేందుకు 14వ తేదీ ఉదయాన్నే సీనియర్ అబ్బాయిలకు ఆ దృశ్యాలను చూపింది.

అయితే అబ్బాయిలు కొందరు ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లలోకి అప్‌లోడ్ చేసుకుని చూస్తున్న విషయం తెలుసుకున్న రిషికేశ్వరి తట్టుకోలేక కళాశాల నుంచి మధ్యలోనే వచ్చేసి హాస్టల్‌లోని తన గదికి వెళ్లి డైరీలో సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే విషయాలు తెలుసుకున్న పోలీసులు ఈ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా, విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్యకు కారణమైన మరికొంత మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+