ఫోటో: జీతం కోసం కలెక్టరేట్ ఎదుట వాచ్ ఉమెన్ దీక్ష
విశాఖపట్టణం: ఏడాది కాలంగా వేతనం అందడంలేదని ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదంటూ మాకవరం పాలెం మండలం తామరం ఎస్టీ సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో వాచ్ ఉమెన్‌గా పని చేస్తున్న టేకు చిన్నతల్లి కలెక్టరేట్ ఎదుట దీక్ష కొనసాగిస్తున్నారు.

సోమనారం మధ్యాన్నం నుండి ఈమె ఈ దీక్ష చేపట్టారు. మంగళవారం ఆమె ఆరోగ్యం కొంత క్షీణించడంతో పోలీసుల అభ్యర్దన మేరకు కింగ్ జార్చీ ఆస్పత్రికి చెందిన వైద్యులు ఆమెను పరీక్షించారు.
తన సమస్యను జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకొందామని వచ్చినా ఫలితం లేకపోయిందని, సమస్య పరిష్కారమయ్యే వరకూ దీక్ష చేస్తానని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications