జల వివాదం : జగన్ సర్కార్ చేతులు ముడుచుకుని కూర్చోలేదు,తెలంగాణా మంత్రులకు బొత్సా కౌంటర్ !!

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య వాటర్ వార్ కొనసాగుతోంది. తెలంగాణ ప్రాంతంలోని మంత్రులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడుతూ, సీఎం జగన్ మోహన్ రెడ్డి జల దోపిడీకి పాల్పడుతున్నాడని విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేకూర్చే విధంగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని, దోపిడీలో వైయస్సార్ ని మించిన వ్యక్తి వైయస్ జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రులు మాటలు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించడం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తుంటే తెలంగాణ మంత్రులు ఇష్టారాజ్యంగా మాట్లాడడం పద్ధతి కాదని ఏపీ మంత్రులు విమర్శిస్తున్నారు.

రాజకీయ లబ్ది కోసమే తెలంగాణా మంత్రుల విమర్శలు

రాజకీయ లబ్ది కోసమే తెలంగాణా మంత్రుల విమర్శలు

ఇటీవల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రాయలసీమ ఎత్తిపోతల పథకం పై, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదం పై తెలంగాణ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అన్నారు. ఇక తాజాగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ లబ్ది కోసం తెలంగాణ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ నాయకులకు అక్కడి ప్రజలు తప్పక బుద్ధి చెప్పే రోజు వస్తుందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

 తెలంగాణ మంత్రులలా అసభ్య పదజాలం ఉపయోగించాల్సిన అవసరం లేదు

తెలంగాణ మంత్రులలా అసభ్య పదజాలం ఉపయోగించాల్సిన అవసరం లేదు

నీటి పంపకాల అంశంపై ఏపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని పేర్కొన్న బొత్స సత్యనారాయణ, సమస్యను మరింత జఠిలం చేయడానికి, తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోలేదని పేర్కొన్న బొత్స సత్యనారాయణ తెలంగాణ మంత్రులలా అసభ్య పదజాలం ఉపయోగించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. విభజన చట్టానికి లోబడే నీటి పంపకాలు ఉంటాయని, చట్ట పరిధులు దాటితే వ్యవస్థలు జోక్యం చేసుకుంటాయని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

 మౌనంగా ఉన్నాం అనుకుంటే ఎలా ? మాకూ వ్యూహాలున్నాయి

మౌనంగా ఉన్నాం అనుకుంటే ఎలా ? మాకూ వ్యూహాలున్నాయి

ఫెడరల్ వ్యవస్థలో ఎవరి అధికారులు వారికి ఉంటాయని ఆయన ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులకు మరోమారు తెలిపారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సహకరిస్తామని, తాము మౌనంగా ఉన్నామని అనుకుంటున్నారని, తమ వ్యూహాలు తమకు ఉన్నాయని బొత్సా పేర్కొన్నారు. ఈరోజు కృష్ణా కరకట్ట విస్తరణ పనులు మొదలు పెట్టిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ తెలుగు రాష్ట్రాల జల వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రుల్లా తాము మాట్లాడకున్నా, తమ వ్యూహాలు తమకు ఉన్నాయని ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా వ్యవహరిస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+