చంద్రబాబు-పవన్ సైలెంట్‌గా ఉన్నా.. జనసేనతో పొత్తుపై క్లారిటీ వచ్చేసింది..!!

అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో కొద్దిరోజులుగా పొత్తుల వ్యవహారం నడుస్తోంది. తెలుగుదేశం- భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తులు ఓ కొలిక్కి వచ్చాయంటూ లీకులు చక్కర్లు కొట్టాయి. టీడీపీ సోషల్ మీడియా విభాగం దీన్ని విస్తృతంగా సర్కులేట్ చేసింది. బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు దీన్ని తోసిపుచ్చినప్పటికీ- బ్రేకులు పడలేదు. టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని సోము వీర్రాజు తేల్చేసినా ఎవరూ పట్టించుకోలేదు. వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా టీడీపీ విష ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు బీజేపీ నాయకులు.

పొత్తులపై..

పొత్తులపై..

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ - టీడీపీ అధినేత చంద్రబాబు పలకరింపుల అనంతరం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అంశం అనేది తెర మీదికి వచ్చింది. అనేక రకాలుగా చర్చలు సాగాయి. ఒకదశలో చంద్రబాబు కూడా పొత్తులపై స్పందించారు. మీడియా రాసుకునే వార్తలకు తాను వివరణ ఇచ్చుకోలేనని స్పష్టం చేశారు. పొత్తుల విషయం ఖరారైతే తానే అధికారికంగా ప్రకటిస్తాననీ తేల్చి చెప్పారు. బీజేపీ నాయకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు.

జీవీఎల్ రియాక్ట్..

జీవీఎల్ రియాక్ట్..

ఈ వార్తలకు బ్రేక్ పడకపోవడంతో బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు మళ్లీ దీనిపై రియాక్ట్ అయ్యారు. తాము జనసేన పార్టీతో మాత్రమే పొత్తులో ఉన్నామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు తేల్చి చెప్పారు. ఇందులో సందేహాలు అనవసరమని స్పష్టం చేశారు. పొత్తులో ఉన్నప్పటికీ.. ఏ పార్టీ అభివృద్ధి కోసం ఆ పార్టీ వేర్వేరుగా కార్యక్రమాలను నిర్వహించుకుంటోన్నాయని వివరించారు. అంతమాత్రాన విడిపోయినట్లు కాదని వ్యాఖ్యానించారు.

గ్రామస్థాయిలో

గ్రామస్థాయిలో

తమ పార్టీ హైకమాండ్ రెండు తెలుగు రాష్ట్రాలపై దృష్టి పెట్టిందని జీవీఎల్ పేర్కొన్నారు. పార్టీని బూత్ స్థాయి వరకు తీసుకెళ్లడానికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఏపీ, తెలంగాణల్లో బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకోవడానికి త్వరలోనే సమావేశాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామస్థాయిలో బీజేపీ బలపడుతుందని, 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి అధికారాన్ని అందుకునేలా తయారవుతుందని అన్నారు.

ప్రజాదరణ ఉన్నవారితో కలుస్తాం..

ప్రజాదరణ ఉన్నవారితో కలుస్తాం..

జూనియర్ ఎన్టీఆర్‌‌ సేవలను వినియోగించుకునే విషయంలో తమకు ఓ స్పష్టత ఉందని జీవీఎల్ నరసింహా రావు అన్నారు. ఆయనతో ప్రచారం చేయించుకునే విషయంలో సోము వీర్రాజు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాదరణ ఉన్నవారిని తాము ఖచ్చితంగా కలుస్తామని, ఇది తప్పేమీ కాదని చెప్పారు. ఇందులో భాగంగానే- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా- జూనియర్ ఎన్టీఆర్‌తో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా- నితిన్‌తో సమావేశం అయ్యారని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+