ఇప్పుడు నోరు మెదపడం లేదు: కెసిఆర్‌పై పొన్నాల
హైదరాబాద్: పొత్తుల కోసం తాము అర్రులు చాచడం లేదని, పొత్తుల కోసం ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై విమర్శలు చేశారు. ఇటీవల ఒక మహా నాయకుడికి బీసీలు ఇప్పుడే జ్ఞాపకం వచ్చారని ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి విమర్శించారు.
మరో ఉద్యమపార్టీ నేత తెలంగాణ వస్తే దళితులను ముఖ్యమంత్రిగా, మైనారిటీలను ఉపముఖ్యమంత్రిగా చేస్తానని మాట్లాడి, తెలంగాణ ఆవిర్భావం తర్వాత నోరు మెదపడం లేదని ఆయన కెసిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు శాశ్వతం కాదన్నారు. సామాజిక తెలంగాణ కోసమే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బుధవారంనాడు ఆయన గాంధీభవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

రెండు ఎంపీ సీట్ల బలం మాత్రమే ఉందని, అందులోనూ ఒక ఎంపీ సరిగా లేని పార్టీ అది, దాంతో తెలంగాణ వచ్చిందంటే ప్రజాస్వామ్యవాదులెవరైనా నమ్ముతారా? అని ఆయన తెరాసను ఉద్దేశించి ప్రశ్నించారు. విలీనం విషయంలో కెసిఆర్ మాట తప్పారన్న విషయంలో సందేహమెందుకని ఆయన మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్న వేశారు.
దళిత, వెనుకబడిన, మైనారిటీ, మహిళలకు సముచిత స్థానం కల్పించడంలో కాంగ్రెస్ తొలి నుంచీ ముందుందన్నారు. పార్టీలోని అన్నీ వర్గాల అభిప్రాయాలను గౌరవిస్తూ సమన్వయంతో ముందుకు పోతామన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పాటైందన్నారు. అమరవీరుల త్యాగాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగావకాశాల్లో వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలంగాణ నవ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జై తెలంగాణ తమ నినాదమని, జైజై తెలంగాణ తమ విధానమన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బలంగా ఉందన్నారు. తనకు తెలంగాణ పీసీసీ అధ్యక్షపదవి ఇచ్చినందుకు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారన్న వ్యాఖ్యలను కొట్టివేశారు. అందరినీ కలుపుకుని పార్టీని విజయపథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణం కెసిఆర్‌తోనే సాధ్యమని తెరాస నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై పొన్నాల స్పందించారు. పునర్నిర్మాణం అనే పదమే తప్పు అన్నారు. ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సోనియగాంధీ తెలంగాణ ఇవ్వడంతో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా ఉన్నారన్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు












Click it and Unblock the Notifications