సిఎం సహా పార్టీ వీడేందుకు రెడీ, పార్టీ ఆలోచన: జెసి

అందరి మనసుల్లోను కొత్త పార్టీ ఆలోచన ఉందని చెప్పారు. పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, కేంద్రమంత్రులు ఎవరు కూడా రాజీనామాలు చేయవద్దన్నారు. పార్లమెంటులో, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడించేందుకైనా పదవులలో కొనసాగాల్సి ఉందన్నారు.
రాజీనామాలొద్దని సిఎం చెప్పారు: ఏరాసు
రాజీనామాలతో సమస్య జఠిలం అవుతుందని, రాజీనామాలు చేయవద్దని ముఖ్యమంత్రి తమకు సూచించారని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చెబితేనే తాము రాజీనామాలపై వెనక్కి తగ్గామన్నారు. రాజీనామాలు చేస్తే తెలంగాణ బిల్లు ఏకపక్షంగా ఆమోదం పొందుతుందన్నారు. ఇదే విషయాన్ని తమకు సిఎం చెప్పారన్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనించాలన్నారు.
తాము తెలంగాణ తీర్మానాన్ని ఓడించేందుకే పదవులలో కొనసాగుతున్నామని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన పార్టీలో సమైక్య ఉద్యమంలో చేరి అల్లరి చేస్తున్నాయని ఆరోపించారు. రాజీనామాలపై ఉద్యోగులతో చర్చిస్తామని, తమకు పదవులు ముఖ్యం కాదన్నారు. రాజీనామాలు పరిష్కారం కాదన్నారు. ప్రతిపక్షాలు తాము ఇచ్చిన లేఖలు వెనక్కి తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications