విభజనకు సహకరించం!: జగన్, టి టూర్ లిస్ట్‌పై కసరత్తు

అన్ని పార్టీలు జివోఎంను వ్యతిరేకించి సమైక్య ఉద్యమం కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. జివోఎం తరఫున కేంద్ర హోంశాఖ అఖిల పక్ష సమావేశానికి హాజరు కావాలని తమ పార్టీకి లేఖ రాసినట్లు చెప్పారు. దానిని బహిష్కరించాలని నిర్ణయించుకున్నామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరుతూ తాము లేఖ రాశామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనేదే తమ డిమాండు అన్నారు.
కేబినెట్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు విభజనను వ్యతిరేకిస్తున్నారన్నారు. మూడు నెలలుగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమం జరుగుతోందని, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలి ఇప్పటికైనా సమైక్యాంధ్ర కోసం కృషి చేయాలని వారు కోరారు. రాష్ట్రపతి, ప్రధానిలకు తాము లేఖలు పంపిస్తామన్నారు.
టి పర్యటనపై జగన్ కసరత్తు
వైయస్ జగన్ తెలంగాణలో పర్యటించేందుకు కసరత్తు చేస్తోన్నట్లుగా తెలుస్తోంది. వైయస్ విజయమ్మ నాలుగు రోజుల క్రితం పర్యటించనప్పుడు ఉద్రిక్తత ఏర్పడిన విషయం తెలిసిందే. విభజన జరిగితే తెలంగాణలోను తమ పార్టీ ఉంచే ఉద్దేశ్యంలో భాగంగా జగన్ ప్రస్తుతం సెంటిమెంట్ తక్కువగా ఉన్న తెలంగాణ ప్రాంతాల్లో పర్యటించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే బలమైన స్థాని రాజకీయ నాయకుల ద్వారా సెంటిమెంటును అధిగమించాలని చూస్తున్నారట.
ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో సెంటిమెంట్ తక్కువగా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. వీటితో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ వంటి జిల్లాల్లో సెంటిమెంట్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించేందుకు జగన్ నేతలతో చర్చలు జరుపుతున్నారట. ఇందుకు సంబంధించి జగన్ ఓ లిస్ట్ తయారు చేసుకుంటున్నారట.












Click it and Unblock the Notifications