బిజెపి కలిస్తే ఏం చేయలేం: టిపై చేతులెత్తేసిన కావూరి

పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు తాము ఏ పార్టీని కలవబోమని చెప్పారు. తమ పార్టీ అధిష్టానం పైనే తాము పోరాటం చేస్తామని చెప్పారు. బిల్లు పాస్ అయ్యేందుకు కాంగ్రెసు, బిజెపిలు కలిస్తే తామేం చేయలేమని చెప్పారు. అయితే రాష్ట్ర విభజన ఆగుతుందనే నమ్మకం తనకు ఇప్పటికీ ఉందన్నారు. పార్లమెంటులో టి బిల్లును వ్యతిరేకిస్తామని, భద్రాచలం డివిజన్ సీమాంధ్రలో ఉంటేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు.
కిరణ్‌కు యనమల లేఖ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసన మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు మంగళవారం లేఖ రాశారు. మంత్రుల బృందం (జివోఎం)కు ఇచ్చిన రెండు పుస్తకాల నివేదికను బహిరంగ పర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన నివేదిక పబ్లిక్ డాక్యుమెంటే అన్నారు.
జివోఎంకు బాలరాజు లేఖ
మంత్రి బాలరాజు జివోఎంకు లేఖ రాశారు. పాడేరు, భద్రాచలం, రంపచోడవరం కేంద్రాలను కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు.
హోంతో టి నేతలు
హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేతో తెలంగాణ ప్రాంత ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, రాజయ్యలు భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications