ముద్దునే నిలదీయలేదు..బాబునెలా అడుగుతారు: రోజా

చిత్తూరు: స్థానిక సమస్యల పైన ఇక్కడి గాలి ముద్దుకృష్ణమ నాయుడినే ప్రజలు నిలదీయలేకపోయారని, ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ఎలా నిలదీస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు, నగరి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి రోజా అన్నారు.

ఆమె సోమవారం నగరిలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రానున్న సార్వత్రిక ఎన్నికలల్లో ఎమ్మెల్యే, పార్లమెంటు అభ్యర్థుల విజయం కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలన్నారు. వైయస్ జగన్ వల్ల రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమన్నారు.

We can't question Chandrababu: Roja

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు కలసిపోవడం వల్ల వారు తమ పార్టీని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు నగరిలో ఇసుక అమ్ముకున్న సంఘటన నగరి ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. నగరి మున్సిపాలిటీ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నించలేదన్నారు. ఒక ముద్దునే నిలదీయలేని పరిస్థితిలో ప్రజలు ఉంటే చంద్రబాబును ఎలా అడగతారని ప్రశ్నించారు.

జగన్ సిఎం అయితే: సామాన్య కిరణ్

జగన్ ముఖ్యమంత్రి అయితే జిల్లాలో పెండింగ్‌లో వున్న హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను పూర్తి చేయిస్తానని చిత్తూరు పార్లమెంట్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి సామాన్య కిరణ్ హామీ ఇచ్చారు. సోమవారం సామాన్య కిరణ్ అసెంబ్లీ అభ్యర్థి జంగాలపల్లె, మాజీ ఎమ్మెల్యే సికెబాబుతో కలసి చిత్తూరు నగరం నుండి తన ప్రచారం ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+