'ప్రత్యేక హోదా ఉద్యమంలో మేం పాల్గొనం, రాజకీయపార్టీలన్నీ కలిసి పోరాడాలి'
ఉద్యోగాలు చేస్తూ ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనలేమని ఎపి ఎన్ జి వో అధ్యక్షుడు ఆశోక్ బాబు చెప్పారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో అన్ని రాజకీయపార్టీలు కలిసి పోరాడితే మద్దతిస్తామన్నారు.
విజయవాడ:ఉద్యోగాలు చేస్తూ ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనలేమని ఎపి ఎన్ జి వో అధ్యక్షుడు ఆశోక్ బాబు చెప్పారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో అన్ని రాజకీయపార్టీలు కలిసి పోరాడితే మద్దతిస్తామన్నారు.
ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు విడివిడిగా ఉద్యమం చేస్తే హోదా రాదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు డిల్లీకి వెళ్ళి ఉద్యమం చేయాలన్నారు.

ప్రత్యేక హోదా కోసం హమీ ఇచ్చిన రాజకీయ పార్టీలు తమ హమీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. ఈ హమీని నిలబెట్టుకొనేందుకుగాను పార్టీలు పనిచేయాలని ఆయన కోరారు.
ఎపి ఎన్ జి వో నూతన కార్యవర్గం సోమవారం ప్రమాణస్వీకారం చేసింది. నూతనకమిటీ అధ్యక్షుడిగా ఆశోక్ బాబు ఎన్నికయ్యారు.అయితే ఆశోక్ బాబు నేతృత్వంలోని కార్యవర్గం ప్రమాణస్వీకారం చేసింది.












Click it and Unblock the Notifications