ఆసక్తికరం: 'బాబు హీరోగా, నేను కమెడియన్‌గా నాటకం, టెన్త్ వరకు క్లాస్‌మేట్స్'
చిత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సుదీర్ఘ కాలం నుండి రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు సిని రంగంతో మంచి సంబంధాలున్నాయి. ఉన్నత విద్యాభ్యాసం చేసే సమయంలోనే చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌తో కలిసి చంద్రబాబునాయుడు నటించాడు. ఈ నాటకంలో చంద్రబాబునాయుడు హీరో వేషం వేస్తే, శివప్రసాద్ హస్య నటుడి వేషం వేశాడు.
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుది చిత్తూరు జిల్లా. నారావారిపల్లె ఆయన స్వగ్రామం. అయితే చంద్రబాబునాయుడు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌లు క్లాస్‌మేట్స్. వీరిద్దరూ కూడ ఇప్పటికీ ఇదే స్నేహన్ని కొనసాగిస్తున్నారు.
శివప్రసాద్ వృత్తి రీత్యా డాక్టర్ . అయితే ఆయనకు నటన అంటే ఇష్టం.ఈ ఇష్టం కారణంగానే శివప్రసాద్ సినిమాల్లో నటిస్తుంటారు.అవకాశం చిక్కినప్పుడల్లా శివప్రసాద్ సినిమాల్లో వేషాలు వేస్తుంటారు. తాజాగా సప్తగిరి ఎల్ఎల్‌బి సినిమాలో కూడ ఆయన నటించారు.

స్కూల్లో హీరోగా నటించిన బాబు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌లు క్లాస్‌మేట్స్. శివప్రసాద్, చంద్రబాబునాయుడులు పరువు కోసం అనే నాటిక వేశారు.అందులో చంద్రబాబు హీరో. అందులో తాను హస్య నటుడిగా నటించినట్టు శివప్రసాద్ గుర్తు చేశారు.అయితే ఆ తర్వాత శివప్రసాద్ నటనను కొనసాగించారు. కానీ, చంద్రబాబునాయుడు మాత్రం రాజకీయాల్లో పూర్తి కాలాన్ని కేటాయించారు.

పాటలు బాగా పాడేవాడిని
చంద్రగిరికి సమీపంలోని పురిత్తివారిపల్లి శివప్రసాద్ స్వంత గ్రామం. ఈ ఊళ్ళో సాయంత్రమైతే కోలాటాలు, చెక్క భజనలు చేసేవారు. వీధి నాటకాల్లో అనుకోకుండా శివప్రసాద్ నటించాడు. ఇక ఆనాటి నుండి నటనపై ఆయన తన మోజును వీడలేదు.హైస్కూల్‌లో టీచర్ కూడ శివప్రసాద్ నటనలో మరింత ఆసక్తి పెరగగానికి కారణంగా మారింది.ఓ మాస్టారు సంగీతం, డ్రామాలు డైరెక్ట్ చేసేవారు. ఆరో తరగతి నుండి మాకు అవకాశాలు వచ్చాయి. నేను బాగా పాడేవాడ్ని. యాక్ట్ చేసేవాడ్ని. ఫ్యాన్సీ డ్రెస్సులు వేసి స్టైల్‌గా వుండేవాడ్ని. అన్నింట్లో ముందుండేవాడ్ని అని శివప్రసాద్ గుర్తు చేసుకొన్నారు.

కల్చరల్ యాక్టివిటీస్‌లో యాక్టివ్
చిన్నతనం నుండి మెడిసిన్ చదివే సమయం వరకు కూడ కల్చరల్ యాక్టివిటీస్‌లో ముందుండేవాణ్ణని శివప్రసాద్ గుర్తు చేసుకొన్నారు.హైస్కూల్ చదివే సమయంలో నాటకాలతో నటనను ప్రారంభించినట్టు శివప్రసాద్ చెప్పారు. అయితే నటనపై ఆసక్తి ఇంకా కూడ తగ్గలేదంటున్నారాయన. అవకాశం చిక్కినప్పుడల్లా సినిమాలో నటిస్తున్నట్టు ఆయన చెప్పారు.

ప్రాక్టీస్ సమయంలో డైలాగ్స్ చెప్పించుకొనేవారు
మెడిసిన్ చేసే సమయంలో ప్రొఫెసర్స్ అందరూ ఆర్ట్ గురించి ఇంట్రెస్ట్‌గా వుండేవారు. ప్రాక్టీస్ అప్పుడే డైలాగ్స్ చెప్పించుకుని బాగా ఎంకరేజ్ చేసేవారని శివప్రసాద్ చెప్పారు. వివాహమైన తర్వాత కూడ కాలేజ్‌లో జాబ్ చేస్తూ, కల్చరల్ ప్రోగ్రాంస్‌కి నన్నే డైరెక్టర్‌గా అప్పాయింట్ చేశారు. కాలేజ్‌లో కొన్ని గ్రూప్స్ తయారు చేసి స్టేట్ అంతా తిరిగినట్టు శివప్రసాద్ గుర్తు చేసుకొన్నారు.












Click it and Unblock the Notifications