అందరికి ఇచ్చినట్లే: కేంద్ర ఆర్థిక సాయంపై చంద్రబాబు అసంతృప్తి

హైదరాబాద్: రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. తాము కోరుకోకపోయినా విభజన జరిగిపోయిందని ఆయన అన్నారు. విభజన అనేది చరిత్ర అని, దాన్ని తిరగరాయలేమని చెప్పారు. చంద్రబాబునాయుడు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన న్యాయం జరగలేదని అన్నారు.

ఏపికి కేంద్ర సాయంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన విధంగానే ఏపికి కేంద్రం సాయముందని, ప్రత్యేకమేమివ్వలేదని చంద్రబాబు అన్నారు. కేంద్ర సాయం విషయంపై ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని చంద్రబాబు చెప్పారు. మరిన్ని నిధులు కేటాయించాలని కోరుతానని చెప్పారు.

రాష్ట్రాల పన్నుల వాటాను కేంద్రం 42శాతానికి పెంచడం అభినందనీయమని చంద్రబాబు అన్నారు. దీని వల్ల రాష్ట్రాలకు లాభమేనని అన్నారు. పన్నుల్లో వాటా పెంచడం సంతోషకరమని అన్నారు. కేంద్రం నిర్ణయం సమాఖ్య స్ఫూర్తిని పెంచే విధంగా ఉందని అన్నారు. ఏపి ఏ పరిస్థితుల్లో ఉందో ఆర్థిక సంఘానికి వివరించామని చెప్పారు. మిగిలిన రాష్ట్రాల స్థాయికి ఏపి వచ్చే వరకూ ఆదుకోవాలని కోరామని తెలిపారు.

We will asks central more funds for AP: Chandrababu

2013 జనాభా ఆధారంగా నిధులు కేటాయించారని చంద్రబాబు చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు రెవెన్యూ లోటు కింద ఐదేళ్లలో ఏపి రాష్ట్రానికి రూ. 22,113 కోట్లు కేటాయించారని తెలిపారు. కేంద్రం మరింత సాయం చేస్తే తప్ప రాష్ట్రానికి న్యాయం జరగదని అన్నారు. తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాలు మిగులు బడ్జెట్‌తో నడుస్తుండగా.. ఏపి భారీ రెవెన్యూ లోటుతో నడుస్తోందని అన్నారు.

విభజనకు ముందు పెట్టుబడులు, పరిశ్రమలు హైదరాబాద్‌కు వచ్చాయని అన్నారు. ఇప్పుడు విభజనానంతరం ఏపి రాష్ట్రానికి పరిశ్రమలు రావాలంటే మరింత కేంద్ర సాయం అవసరమని చెప్పారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు కేంద్రం ఏపికి సాయం చేయాలని కోరతామని చంద్రబాబు తెలిపారు.

ఆ తర్వాత తాము కూడా దేశాభివృద్ధిలో సహకరిస్తామని అన్నారు. ఏపి చాలా ఇబ్బందుల్లో ఉందని, కోరుకున్నదానికంటే తక్కువగానే నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ లాంటి చిన్న రాష్ట్రాలకు ఎక్కువగా నిధులు కేటాయించారని అన్నారు. విభజన అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆదాయం కంటే ఏపి రాష్ట్ర ఆదాయం చాలా తక్కువగా ఉందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం తానొక్కడినే కష్టపడితే సరిపోదని, అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+