Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'లోపల పశ్చాత్తాపం, బయట మరోలా వైసిపి ఎమ్మెల్యేలు', టిడిపిలోకి మరికొంతమంది'

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర రెడ్డిలు కమిటీ ముందు పశ్చాత్తాపం ప్రకటించి, బయట మాత్రం మరోలా మాట్లాడుతున్నారని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి అన్నారు.

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర రెడ్డిలు కమిటీ ముందు పశ్చాత్తాపం ప్రకటించి, బయట మాత్రం మరోలా మాట్లాడుతున్నారని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు గురువారం అన్నారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రవర్తన పైన అన్ని ఆధారాలు సేకరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్పీకర్ ఆదేశాలతో ఏర్పడిన ప్రివిలేజ్ కమిటీతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. జనవరిలో ప్రివిలేట్ కమిటీ నివేదికను స్పీకర్‌కు ఇస్తామని చెప్పారు.

ysr congress

మరికొంతమంది టిడిపిలోకి: కళా వెంకట్రావు

త్వరలో మరికొంతమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతారని ఏపీ టిడిపి అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు. జగన్ నాయకత్వ వైఫల్యం, భవిష్యత్‌పై బెంగ, నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేల వలసలు అన్నారు.

తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని సహించమని చెప్పారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. అందరినీ కలుపుకుని వెళ్లాలని చంద్రబాబు సూచించారని, క్రమశిక్షణారాహిత్యం, అవినీతికి పాల్పడిన వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కవన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+