త్వరలో టి ఐటి పాలసీ: కెటిఆర్, ప్రవాసుల సలహాలు..

హైదరాబాద్: తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) విధానాన్ని రూపొందిస్తామని, త్వరలోనే ప్రకటిస్తామని తెలంగాణ ఐటిశాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఇందుకోసం హైదరాబాద్‌లో 150 ఐటి కంపెనీలతో శుక్రవారం సాయంత్రం సమావేశమవుతున్నట్లు చెప్పారు. ఈ భేటీలో ఆయా కంపెనీల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తామని అన్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో ఐటి ఇంక్యుబేటర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని కెటిఆర్ తెలిపారు. ఐటి రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతామని ఆయన తెలిపారు. నైపుణ్యం, విజ్ఞాన అకాడమీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

We will reveal IT policy in soon: KTR

జులై మొదటి వారంలో అమెరికాలో జరిగే ఆటా ఉత్సవాల్లో పాల్గొని ఐటి అభివృద్ధికి తెలుగువారి సలహాలు స్వీకరిస్తామని చెప్పారు. అమెరికాలో ఉన్న ఐటి కంపెనీలతో కూడా ఆ సమయంలో సమావేశం అవుతామని, వారి నుంచి కూడా హైదరాబాద్ ఐటి అభవృద్ధికి సలహాలు తీసుకుంటామని ఆయన వివరించారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా వాడుకుని తెలంగాణ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని కూడా ఆయన తెలిపారు. ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అభివృద్ధి చేసి రూ. 200 కోట్ల వ్యయంతో 500 గోడౌన్లను నిర్మిస్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+