ఏపీలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు: ఉరుములు, 40 కి.మీ. వేగంతో గాలులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఉండగా, దాని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.

ఉత్తర కోస్తాంధ్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురవనున్నాయి. బుధవారం, గురువారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉండగా, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత జిల్లాల్లో గంటకు 20-30 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Recommended Video


దక్షిణ కోస్తాంధ్రాలోనూ భారీ వర్షాలు..
మరోవైపు బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతోపాటు ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజా మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు, మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications