ఏపీలో తగ్గేదే లే అంటున్న వర్షాలు, అల్పపీడనాలతో మరికొద్ది రోజులు: నవంబర్‌లో తుఫాన్లు

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాధారణంగా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు తుఫాన్లు వస్తాయని, ఈ నెలలో ఇప్పటి వరకు తుఫాను వచ్చే పరిస్థితులు లేవని విశాఖ వాతావరణ శాఖ నిపుణుడు మురళీకృష్ణ తెలిపారు.

నవంబర్ నెలలో వాయుగుండాలు, తుఫాన్లు

నవంబర్ నెలలో వాయుగుండాలు, తుఫాన్లు

నవంబర్ నెలలో ఏర్పడే వాయుగుండాలు తుఫానుగా బలపడేందుకు అవకాశం ఉందని తెలిపారు. అల్ప పీడన ప్రభావంతో రాబోయే కొద్ది రోజులపాటు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అక్టోబర్ నెలలో నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్తున్న సమయంలో అల్పపీడనాలు ఏర్పడటం సహజమేనన్నారు.

ఏపీలో అల్పపీడనాలతో విస్తారంగా వర్షాలు

ఏపీలో అల్పపీడనాలతో విస్తారంగా వర్షాలు

ప్రస్తుతం వరుసగా అల్ప పీడనాలు ఏర్పడుతుండటంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఆయన వివరించారు. గతంలో వర్షాలు కురిసినప్పటికీ ఇలా నిరంతరంగా ఎప్పుడూ వానలు కురిసిన దాఖలాలు లేవని తెలిపారు. మరికొన్ని రోజులపాటు ఈ తరహా వానలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తాయని తెలిపారు. ఈ నెలలో అల్పపీడనాలు తుఫానుగా మారే అవకాశాలు లేవన్నారు.

బలపడనున్న అల్పపీడనం.. మోస్తరు నుంచి భారీ వర్షాలు

బలపడనున్న అల్పపీడనం.. మోస్తరు నుంచి భారీ వర్షాలు

గత కొద్ది రోజులుగా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ఉత్తర అండమాన్ సముద్రం, పరిసరాల్లో అక్టోబర్ 18న మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని, అది పశ్చిమ వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాతంవైపు కదిలి 20వ తేదీ నాటికి అల్పపీడనంగా బలపడుతుందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

భారీ వర్షాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

భారీ వర్షాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

కాగా, ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. అనంతపురం జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వరద నీరు ఇళ్లల్లోకి చేరి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు రహదారులపైకి భారీగా చేరుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికీ లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలు వరదనీటిలోనే ఉన్నాయి. మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+