తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు: వచ్చే మూడు రోజులపాటు ఈదురుగాలులు, ఉరుములు
హైదరాబాద్/అమరావతి: నైరుతి రుతుపవనాలు ప్రవేశించిననాటి నుంచి ఒకటి రెండు రోజులు మినహా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కాగా, ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందిన వాతావరణ శాఖ తెలిపింది.

ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు
ఏపీలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోనూ పశ్చిమ, వాయువ్య దిశల నుంచి క్రిందిస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపరితల ద్రోణి బలహీనపడిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులవరకు వాతావరణ సూచనలను తెలియజేశారు. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లోని కొన్ని చోట్ల శనివారం, ఆదివారం, సోమవారం(జులై 3,4,5 తేదీల్లో) రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

కోస్తాంధ్ర, రాయలసీమలోనూ భారీ వర్షాలు
దక్షిణ కోస్తాంధ్రలో శనివారం, ఆదివారం, సోమవారం(జులై 3,4,5 తేదీల్లో) దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల పడే అవకాశం ఉంది. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్లు, ఆదివారంనాడు ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల, మరికొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణలోనూ ఉరుములు మెరుపులు ఈదురుగాలులు
తెలంగాణలోనూ ఇదే రకమైన వాతావరణ పరిస్థులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయన్నారు. తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ద్రోణి బలహీనపడిందని తెలిపారు. ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం, ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని ఒకటి రెండు ప్రాంతాల్లో సోమవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications