వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్ ఉపగ్రహాలు పంపిన రెండ్రోజులకే: ఇస్రో 'యాంత్రిక్స్'ను హ్యాక్ చేసిన చైనా హ్యాకర్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

నెల్లూరు: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)కు చెందిన యాంత్రిక్స్ వెబ్ సైట్‌ను చైనాకు చెందిన హ్యాకర్స్ హ్యాక్ చేశారు. వాణిజ్య విభాగానికి చెందిన ఈ యాంత్రిక్స్‌ను హ్యాక్ చేయడం కలకలం సృష్టించింది. హ్యాక్ చేసిన వారు.. ఆదివారం ఉదయం హోం పేజీని మార్చివేసారు.

కాగా, స్వదేశీ ఉపగ్రహాల ప్రయోగంతో అంతరిక్ష ప్రయోగాల్లో అగ్రదేశాలకు ధీటుగా నిలిచిన ఇస్రో విదేశీ ఉపగ్రహాలను సైతం నింగిలోకి పంపి వాణిజ్యపరమైన భారీ ప్రయోగంలోనుసత్తా చాటింది.

బ్రిటన్ దేశానికి చెందిన ఐదు ఉపగ్రహాలను ఇస్రో కదనాశ్వం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్వీ) రాకెట్ శుక్రవారం విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టింది. వాణిజ్యపరంగా తొలిసారి అత్యంత బరువైన ప్రయోగం.

Website of ISRO's Commercial Arm Antrix Hacked, Reportedly by Chinese Hackers

పీఎస్‌ఎల్వీ సీ-28 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఇవి భారత జాతి గర్వించదగ్గ సంతోషకరమైన క్షణాలని పేర్కొన్నారు.

శుక్రవారం రాత్రి 9.58 నిమిషాలకు ఏపీలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్‌దావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్‌ఎల్వీ సీ-28 ఉపగ్రహాన్ని 20 నిమిషాల వ్యవధిలో విజయవంతంగా సన్ సింక్రొనైజ్డ్ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఉపగ్రహం తనతోపాటు బ్రిటన్‌కు చెందిన 5శాటిలైట్లను మోసుకెళ్లింది.

English summary
Website of ISRO's Commercial Arm Antrix Hacked, Reportedly by Chinese Hackers
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X