• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మద్యపాన నిషేధం సరే.. మరి పత్తాలాటపై జగన్ నిర్ణయమేంటో.. పేకాట పాపారావుల కుటుంబాల్లో అంతులేని వ్యధ

|

పశ్చిమగోదావరి : పత్తాలాటకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో క్లబ్బులు మూతపడటంతో ప్రత్నామ్నాయ దారులు చూసుకుంటున్నారు పేకాటరాయుళ్లు. క్లబ్‌లపై పోలీసులు దాడులు చేయడం.. తీరా అవి మూతపడంతో.. ఛలో యానాం అంటున్నారు. మూడు ముక్కలాటకు బ్రేకులు పడటంతో అక్కడకు వెళ్లి పత్తాలాడేస్తున్నారు. ఆటకు ఆట, మందుకు మందు దొరుకుతుండటంతో దగ్గర్లోని కేంద్ర పాలిత ప్రాంతానికి క్యూ కడుతున్నారు.

  గోదావరి పరుగులు ...ఆనందంలో రైతులు
   జిల్లాలో పత్తాలాటకు బ్రేక్.. ఛలో యానాం

  జిల్లాలో పత్తాలాటకు బ్రేక్.. ఛలో యానాం

  పశ్చిమగోదావరి జిల్లాలో విచ్చలవిడిగా రిక్రియేషన్ క్లబ్బులు వెలిశాయి. అయితే ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ వసతులు కల్పించాల్సిన చోట పత్తాలాట జోరుగా సాగుతుందనే ఆరోపణలున్నాయి. ఆ మేరకు పోలీసుల దాడులు ముమ్మరమయ్యాయి. ఖాకీలు ఉక్కుపాదం మోపడంతో పేకాటకు అవకాశం లేకుండా పోయింది. దాంతో పేకాటరాయుళ్లు దగ్గర్లోని యానాంకు క్యూ కడుతున్నారు.

  జిల్లాలో క్లబ్బులు మూతపడటంతో.. పేకాటకు బానిసలా మారినోళ్లు యానాంకు వెళుతున్నారు. పేకాట ఆడనిదే రోజు గడవని పేకాట పాపారావులు పోలోమంటూ అక్కడ వాలిపోతున్నారు. మందు కూడా తక్కువ ధరకు దొరుకుతుండటంతో అటువైపు మనసు పెడుతున్నారు.

   ఆటకు ఆట.. మందుకు మందు.. యానాంకు క్యూ

  ఆటకు ఆట.. మందుకు మందు.. యానాంకు క్యూ

  ఏలూరు, భీమవరం, పాలకొల్లు తదితర ముఖ్య ప్రాంతాల్లో యూత్ క్లబ్బులు ఇతరత్రా క్లబ్బులు లెక్కకు మించి కనిపిస్తాయి. అంతేగాకుండా కొన్ని గ్రామాల్లో సైతం క్లబ్బులు నిర్వహిస్తున్నారనే ప్రచారముంది. అయితే కొన్ని క్లబ్బులో మాత్రం విచ్చలవిడిగా పేకాట నిర్వహిస్తున్నారు. దాంతో పాటు మద్యం కూడా విరివిగా సప్లై చేస్తున్నారు నిర్వాహకులు.

  క్లబ్బులు, టౌన్ హాల్స్ పేరిట వెలిసే ఇలాంటి రిక్రియేషన్ క్లబ్బులు నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అయితే మూడు ముక్కలాటపై ప్రభుత్వం నిషేధం విధించడంతో.. 13 ముక్కలతో ఆడే రమ్మీ ఆటకు మాత్రం కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో కొన్ని క్లబ్బులు పెద్దమొత్తంలో డబ్బులు పెట్టించి పేకాట ఆడిస్తున్నాయని.. మందు సప్లై చేయడమే గాకుండా అశ్లీల నృత్యాలకు కూడా తావిస్తున్నాయనే ఆరోపణలతో పోలీసులు కొరడా ఝలిపించారు. దాంతో జిల్లాలో రెండు నెలలుగా పలుచోట్ల క్లబ్బులు మూతపడ్డాయి.

  ఒక్క ఫోన్ కాల్.. రైతు డబ్బులు మాయం.. గ్రామాలకు పాకిన సైబర్ మోసం

   వీకెండ్ ముచ్చట.. 48 గంటల జోష్

  వీకెండ్ ముచ్చట.. 48 గంటల జోష్

  మూడు ముక్కలాట ఆడేందుకు దగ్గర్లోని యానాంకు పరుగులు పెడుతున్నారు పేకాటరాయుళ్లు. అక్కడైతే ఆటకు ఆట.. మందుకు మందు దొరుకుతుందనే కారణంతో క్యూ కడుతున్నారు. వీకెండ్‌లో శని, ఆదివారాలు యానాంకు వెళుతూ 48 గంటలు ఫుల్ జోష్‌లో మునిగి తేలుతున్నారు. పేకాట ఆడటం, మందు తాగడం.. ఆ రెండు పనులు తప్ప మరో ప్రపంచం తెలియకుండా గడిపేస్తున్నారు. ఇక పేకాట ఆడటం తప్పితే పొద్దు గడవని చాలామంది వారాంతాల్లోనే కాకుండా మిగతా రోజుల్లోనూ అక్కడికే క్యూ కడుతున్నారట.

   కొలంబో, బ్యాంకాక్‌కు కూడా..!

  కొలంబో, బ్యాంకాక్‌కు కూడా..!

  ఎంజాయ్ పేరిట లక్షలకు లక్షలు తగలేస్తున్నారు పేకాటరాయుళ్లు. కొన్ని సందర్భాల్లో శ్రీలంకలోని కొలంబోతో పాటు బ్యాంకాక్‌కు కూడా పయనమవుతున్నారు. బ్యాంకాక్‌ ఐతే మందు, విందు, పొందు అన్నీ ఆస్వాదించొచ్చని ఫిక్సవుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ రెండు ప్రాంతాలకు వారంతం ట్రిప్పులతో విమానాలు కిక్కిరిసిపోతున్నాయని తెలుస్తోంది.

  కొలంబో, బ్యాంకాక్‌కు వెళ్లే పేకాటరాయుళ్లకు 24 గంటలపాటు అన్ని రకాల వినోదాలు అందించే క్లబ్బులున్నాయి. వాటిని అరెంజ్ చేసేందుకు కొన్ని టూరిస్టు సంస్థలు ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఇక క్యాసినోలు నిర్వహించేవారు.. తమ రెగ్యులర్‌ కస్టమర్ల కోసం అనేక ఆఫర్లు ఇస్తుంటారు. హోటల్‌లో బెడ్డు దగ్గర నుంచి ఫుడ్‌, మద్యం ఫ్రీ గా సప్లై చేస్తారు. ఇక హైదరాబాద్ నుంచి కొలంబోకు వెళ్లాలంటే విమాన ప్రయాణం గంట యాభై నిమిషాలే. సమయం గట్రా చూసుకునేవాళ్లు ఎక్కువగా కొలంబోను ప్రిఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Gamblers Went to Yanam for playing cards from west godavari district. Some Recreation Clubs were closed in district while they were obeyed rules and regulations. So, that the gamblers went to yanam which is near to west godavari.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more