గర్భిణిపై రేప్ యత్నం: ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

కాగా, కామంతో దుండుగులు కన్ను మిన్నూ కానకుండా వ్యవహరిస్తారని చెప్పడానికి హైదరాబాదులో దారుణ సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఓ నిండు గర్భిణిపై ఐదుగురు దుండగులు అత్యాచార యత్నానికి ప్రయత్నించారు.
ఈ సంఘటన మూసీనది ఒడ్డున జరిగింది. అడ్డుకోబోయిన భర్తపై దుండగులు దాడి చేశారు. కత్తులతో దాడి చేయడం వల్ల గాయపడిన మహిళ భర్త ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందాడు.
మహబూబ్‌నగర్ జిల్లా ముంగనూరు నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన దంపతులకు ఈ దారుణమైన ఘటన ఎదురైంది. బహర్భూమికి వెళ్లేందుకు దంపతులు మూసీనది ఒడ్డుకు వచ్చారు. ఆ సమయంలో దుండగులు దాడికి దిగారు.












Click it and Unblock the Notifications