పదే పదే ఫ్రిజ్ తలుపు తెరుస్తున్నారా?

ఒకప్పుడు ఫ్రిజ్ అంటే విలాస వస్తువు.. ధనవంతుల ఇళ్లలోనే ఉంటుందనుకునేవారు. కానీ ఈరోజు ప్రతి ఇంట్లో ఫ్రిజ్ అంటుంది. అంత నిత్యావసరమైపోయింది. ప్రతి ఇంట్లో చిన్నపిల్లలుంటే ఫ్రిజ్ తలుపు తీయడం వారికి సరదా ఆటగా ఉంటుంది. ఫ్రిజ్ లోపల చల్లదనం ఎక్కువైనప్పుడు రిఫ్రిజెరాంట్ వాయువు సరఫరా ఆగిపోయేటట్టు, లోపల వెచ్చదనం చేరగానే తిరిగి వాయువు సరఫరా అయ్యేట్టు సెన్సార్లు ఉంటాయి. ఎండవేడిమి ఎక్కువగా ఉందంటూ కొందరు ఫ్రిజ్ తలుపు తెరుస్తుంటారు. దీనివల్ల గదిలో ఉన్న ఉష్ణోగ్రత ఫ్రిజ్ లోకి వెళుతుంది.

ఎప్పుడైతే వెచ్చదనం లోపలికి వచ్చిందో అప్పుడు కంప్రెసర్ యాక్టివేట్ అవుతుంది. పదే పదే తలుపు తెరుస్తుండటంవల్ల కంప్రెసర్ పాడవుతుంది. బయట వెచ్చదనం లోపలికి వెళ్లి అక్కడున్న చల్లగాలితో కలుస్తుంది. అది కరిగి తేమగా మారుతుంది. ఈ తేమ డీప్ ఫ్రిజ్ లో ఐస్ పేరుకు పోవడానికి కారణమవుతుంది. అధికమొత్తంలో పేరుకుపోతే ఫ్రిజ్ లో ఉండే కాయిల్స్ పనితీరు దెబ్బతింటుంది. పన్నీరు, గుడ్లు, క్రీమ్, పాలు, మాంసం లాంటివి పాడవకుండా ఉండాలంటే ఫ్రిజ్ లో స్థిర ఉష్ణోగ్రత ఉన్నప్పుడే పాడవకుండా ఉంటాయి.

 fridge

పదే పదే ఫ్రిజ్ తలుపు తెరిస్తే బయట ఉన్న వెచ్చదనం లోపలికి చేరి పదార్థాలు పాడవడానికి కారణమవుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా ఎక్కువగా పనిచేస్తున్నప్పుడు అధిక విద్యుత్తును వాడుకుంటుంది. దీనివల్ల బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. పొరపాటున ఫ్రిజ్ తలుపు తీసి మరిచిపోయినప్పుడు వెంటనే తలుపు వేశామని సరిపెట్టుకోకూడదు. మొదట ఫ్రిజ్ ఫ్లగ్ ఆపేసి లోపల తేమ ఏర్పడిందేమో చూడాలి.

అందులో ఉండే వస్తువులన్నీ బయటకు తీసి సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచాలి. ఫ్రిజ్ ను శుభ్రం చేసి ఎక్కడైనా తేమ ఉందేమో చూడాలి. తేమ ఏదీ లేదనిపించాక ప్లగ్ ఆన్ చేయాలి. 6 గంటలు ఫ్రిజ్ ను అలాగే ఉంచి తర్వాత వస్తువులన్నింటినీ లోపల పెట్టుకోవాలి. తలుపు తీసి వేయడం మర్చిపోతే లోపల ఉన్న పదార్థాలకు, ఫ్రిజ్ కు కూడా దెబ్బే. కొందరు రాత్రిపూట నిద్రించే ముందు ఫ్రిజ్ ఆఫ్ చేస్తుంటారు. ఇలా వాడితే నష్టాలే ఎక్కువగా ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+