బాబుకు విహెచ్ ప్రశ్న: ఢిల్లీ బిజెపి ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడారు. తాము రాయల తెలంగాణకు వ్యతిరేకమన్నారు. హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణే కావాలన్నారు. సమన్యాయం అని చెబుతున్న చంద్రబాబు దానిపై వివరణ ఇవ్వాలన్నారు. అరవయ్యేళ్ల తెలంగాణ కలను సోనియా నెరవేర్చారని మమంత్రి జానా రెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెసుకు ఇక్కడి ప్రజలు అండగా ఉంటారన్నారు.
బిజెపి కార్యాలయం వద్ద ఉద్రిక్తత, అరెస్ట్
తెలంగాణకు మద్దతు ఇవ్వకూడదంటూ విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు సోమవారం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఇది అక్కడ ఉద్రిక్తత పరిస్థితిని దారి తీసింది. తాము బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని వినతి పత్రం ఇస్తామన్నారు.
పోలీసులు నిరాకరించడంతో ఆందోళన చేపట్టారు. రాజ్‌నాథ్‌కు లేఖ ఇచ్చే వరకు బైఠాయిస్తామన్నారు. దీంతో బిజెపి కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ పోలీసు ఫోర్సును రంగంలోకి దింపారు. మధ్యాహ్నం వారిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications