బీకాంలో ఫిజిక్స్ పై ఆరా తీసిన బాబు, నేను చెప్పిందొకటి, రాసిందొకటని చెప్పిన జలీల్ ఖాన్

బీకాం లో ఫిజిక్స్ అంటే అర్థం ఏమిటని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కృష్ణా జిల్లా పార్టీ నాయకులను ప్రశ్నించారు.అయితే తాను చెప్పిందొకటి, మీడియా రాసిందొకటి అంటూ జలీల్ ఖాన్ బాబుకు సమాధానమిచ్చారు.

అమరావతి:బీకాం లో ఫిజిక్స్ ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పి విజయవాడ పశ్చిమ ఎమ్యేల్యే జలీల్ ఖాన్ పాపులర్ అయ్యారు.అయితే బీకాంలో ఫిజిక్స్ అనే అంశం గురించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరా తీశారు.

అసెంబ్లీసమావేశాల్లో గవర్నర్ కు దన్యవాదాలు తెలిపే తీర్మాణంపై చర్చ సందర్భంగా వైసిపి అధినేత జగన్ కూడ బీకాంలో ఫిజిక్స్ చదివిన వారికి తాను చెప్పే లెక్కలు అర్థం కావంటూ అధికార పార్టీ నాయకులపై వ్యంగ్యాస్త్రాలను సంధించారు.

కృష్ణా జిల్లా పార్టీ నాయకులతో శనివారం సాయంత్రం టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తన నివాసం లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ పటిష్టతపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

jaleel khan

విజయవాడ తూర్పు ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావుపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై కూడ చంద్రబాబునాయుడు ఈ సమావేశంలో వివరణ అడిగారని సమాచారం.

అయితే ఈ సమావేశంలో అనంతపురం జిల్లా నాయకుల ప్రస్తావన వచ్చింది.కలిసి పనిచేయాలంటే రాళ్ళ దాడులు చేసుకొంటున్నారని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. ఈ రకమైన దాడులకు పాల్పడకూడదని ఆయన ఆ జిల్లా నాయకులకు సూచించారు.

బీకాంలో ఫిజిక్స్ పై పార్టీ నాయకులను ఆరా తీసిన బాబు

కృష్ణా జిల్లా పార్టీ నాయకుల సమావేశం సందర్భంగా బీకాంలో ఫిజిక్స్ పై చంద్రబాబునాయుడు అడిగి తెలుసుకొన్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

జలీల్ ఖాన్ అంశం ప్రస్తావనకు వచ్చిన సమయంలో చంద్రబాబునాయుడు ఈ అంశాన్ని అడిగారని సమాచారం.బాబు ఈ ప్రశ్న అడగ్గానే పార్టీ నాయకులంతా ఒక్కసారిగా పెద్ద ఎత్తున నవ్వారట. అయితే సమావేశంలోనే ఉన్న జలీల్ ఖాన్ బాబుకు వివరణ ఇచ్చారు.

తాను మీడియాకు చెప్పిందొకటి, వారు రాసిందొకటని జలీల్ ఖాన్ బాబుకు సమాధానం చెప్పారని పార్టీ నాయకులు చెప్పారు. మొత్తంగా బీకాంలో ఫిజిక్స్ తో జలీల్ ఖాన్ పాపులారిటీ రోజు రోజుకు పెరిగిపోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+