తీవ్ర ఉత్కంఠ, ఆసక్తిగా: ఢిల్లీ పరిణామాలపై బెజవాడలో ఏం జరుగుతోంది?

అమరావతి: బుధవారం ఉదయం నుంచి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. హస్తినలో వేగంగా మారుతున్న పరిణామాలను ఏపీ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ క్రమంలో హస్తిన పరిణామాలపై విజయవాడలో ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం.

కేంద్ర మంత్రి సుజనా చౌదరితో పాటు ఎంపీ కొనకళ్ల నారాయణ, ఏపీ రెసిడెంట్ కమిషనర్‌లు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చలు జరిపిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసినవన్నీ ఆర్ధిక ప్యాకేజీలో ఉంటాయా? లేదా అనే ఉత్కంఠ కలుగుతోంది. జైట్లీతో భేటీ వివరాలను కేంద్ర మంత్రి సుజనా ఎప్పటికప్పుడు ఏపీ సీఎం చంద్రబాబుకు వివరిస్తున్నారు.

ఈ క్రమంలో అందుబాటులో ఉన్న మంత్రులు, టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమైన ఆర్ధిక ప్యాకేజీపై నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ ఆనంతరం బయటకు వచ్చిన విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మూడు అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.

what's happening in vijayawada over delhi developments

ఏపీకి ప్రత్యేకహోదా సెంటిమెంట్‌గా మారిన నేపథ్యంలో హోదా ఇచ్చి తీరాలని అన్నారు. హోదాతో పాటు ఆర్ధిక ప్యాకేజీని కూడా ప్రకటించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. దీంతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

హోదా గురించి ఏపీ ప్రభుత్వం గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉందని అంటున్నారు. హోదా లేదా హోదాకు మించిన స్థాయి ప్రకటన వస్తే దానిపై అప్పుడు ఆలోచిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏపీకి ఆర్ధిక ప్యాకేజీ విషయంపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి జైట్లీ, ఆర్ధిక అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు.

విభజన తర్వాత మొదటి ఏడాది ఏడు వేల కోట్లు రెవెన్యూ ఆర్ధిక లోటు ఉందని, అయితే ఇప్పుడు ఆ ఆర్ధిక లోటు పదహారు వేల కోట్లకు చేరిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు నిధులను కేంద్రమే భరించాలని, ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి కోర్ కేపిటల్‌ నిర్మాణానికి సంబంధించి నిధులను వెంటనే విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి తన డిమాండ్లలో ఉంచింది. ఇదే సమయంలో హోదా అంశం రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో హోదాపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+