కృష్టా నది ప్రాజెక్టుల వివాదంలో షర్మిల మద్దతెవరికి..!?
ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జలయుద్దం మొదలైంది. జగన్ ప్రభుత్వానికి మేలు చేసేలా కేసీఆర్ నాడు నిర్ణయాలు తీసుకున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఏం జరిగిందో వివరిస్తూ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోంది. కృష్టా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదించింది. నాడు ఈ నీటి వివాదాలపై వైఎస్సార్టీపీ చీఫ్ గా స్పందించిన షర్మిల ఇప్పుడు ఏపీసీసీ చీఫ్ గా ఏ స్టాండ్ తో ఉంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ప్రాజెక్టుల వివాదం : తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య కృష్టా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించింన అంశం వివాదంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ప్రాజెక్టులను కేఆర్ఎంబీ కి అప్పగించటాన్ని తప్పు బడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమానికి సిద్దమయ్యారు. రేపు (మంగళవారం) నల్గొండ వేదికగా భారీ సభకు నిర్ణయించారు. దీంతో, రేవంత్ ప్రభుత్వం అప్రమత్తం అయింది. నాడు కేసీఆర్ ఏపీలోని జగన్ ప్రభుత్వానికి మేలు చేసేందుకు తెలంగాణకు నష్టం చేసేలా నిర్ణయాలు తీసుకుందని ఆరోపిస్తోంది. దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోంది. కృష్టా నది ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదించింది.

తెలంగాణ ప్రభుత్వ తీర్మానం : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారని కేసీఆర్ ను టార్గెట్ చేసింది. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు అంగీకరించిన కృష్టా నది ప్రాజెక్టుల నిర్వహణ కేంద్రానికి అప్పగించ బోమని తీర్మానం చేసింది. ఇప్పుడు దీని పైన ఏపీ ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున సాగర్ పైన ఏపీ పోలీసులు రావటం పైన రాజకీయంగా విమర్శలు వచ్చాయి. ఆ తరువాత కేంద్రం సీఆర్పీఎఫ్ బలగాలను దించి ఏపీ పోలీసులను వెనక్కు పంపింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి జరిగిన సమావేశాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించిందనే ప్రచారాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. నాడు ముఖ్యమంత్రులుగా కేసీఆర్ - జగన్ మధ్య జరిగిన ఒప్పందాలను సభలో వివరించారు.

షర్మిల వైఖరి ఏంటి : ఇక, వైఎస్సార్టీపీ అధినేత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రయోజనాల కోసం తాను పోరాటం చేస్తానని షర్మిల ప్రకటించారు. ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనల మేరకు ఏపీకి మేలు జరిగేలా జగన్ వ్యవహరించారని..అందుకు కేసీఆర్ సహకరించారని విమర్శిస్తున్నారు. ఇక, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న వాదనతో ఏకీభవిస్తారా .. ఏపీ ప్రయోజనాలకు అనుగుణంగా స్పందిస్తారా అనేది కీలకంగా మారుతోంది. అటు సొంత పార్టీ ప్రభుత్వం..ఇటు రాష్ట్ర ప్రయోజనాలు అంశంలో షర్మిల ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications