అక్టోబర్‌8న తెలుగు రాష్ట్రాల్లో ఏదో జరగబోతుందట:కొందరు తెలంగాణాలో అంటున్నారు...మరి కొందరు ఎపి అంటున్

అమరావతి:అక్టోబరు 8న...ఏం జరుగుతుంది..? ఏం జరగబోతుంది?...అదేంటీ అంత ప్రత్యేకంగా అడిగారు అని అనుకుంటున్నారా?...నేనే కాదు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న కొన్ని పోస్టులు చూస్తే ఎవరైనా అలాగే అడుగుతారు.

ఆ రోజున తెలంగాణాలో ఏదో అత్యంత కీలకమైన ఘటన జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షమవుతుండగా...మరో వైపు ఎపిలో అక్టోబర్ 8 న ఏదో అనూహ్య సంఘటన జరగబోతోంది. దీనికి రాజకీయంగా ఎనలేని ప్రాధాన్యత ఏర్పుడుతుందంటూ మరికొన్ని పోస్టులు అదే సోషల్ మీడియాలో మల్ చల్ చేస్తున్నాయి. దీంతో ఈ అక్టోబర్ 8 తేదీ ఏమిటో...ఆ రోజే ఈ ఘటనలు ఎందుకో...ఇంతకీ అది ఏ రాష్ట్రంలో జరుగుతుందో తెలియక రీడర్లు జుట్టుపీక్కుంటున్నారట.

 What will Happens on October 8th in AP or Telangana

తెలంగాణలో రేపు రాబోయే అక్టోబరు 8 చాలా కీలకమట...దీనికి కారణం సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని పోస్టులే అని తెలిసినా రాజకీయ నాయకులు సైతం ఈ అక్టోబరు 8 న్యూస్ ని బలంగా నమ్ముతుండటం...ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తుందట...ఇంతకీ తెలంగాణాకు సంబంధించి చూస్తే...ఆరోజు ఏం జరుగుతుంది...పోనీ ఏం జరగొచ్చు...హరీష్ రావు బీజేపీలోనే, కాంగ్రెస్ లోనో ఏమైనా చేరతాడా... లేకపోతే కాంగ్రెస్ లో కీలకమైన లీడర్లు టిఆర్ఎస్ లోకి వచ్చేస్తారా?...అబ్బే ఆ ఛాన్స్ లేదు...ఇంకా అలాంటి లీడర్లు ఎవరు ఉన్నారు అనుకుంటున్నారా?...

పోనీ టిడిపి , టిఆర్ ఎస్ ల మధ్య పొత్తు గురించి ఏమైనా ప్రకటన వెలువడుతుందా?...అబ్బే భూమి తలకిందులైనా అలా జరగదు అంటారా?...అంటే బిగ్ బాస్ తరహాలో రాజకీయాల్లో ఏమైనా జరొగొచ్చు అనడానికి లేదా?...సరే...అంతటి కీలక ఘటన ఏమి జరగొచ్చో మీరే ఊహించుకోండి. కానీ ఆ రోజు ఇది మాత్రం జరుగుతుందట...ఆరోజు తెలంగాణ వోటర్ల తుది ముసాయిదాలను ప్రచురిస్తారట...బహుశా అదేరోజు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావచ్చని అని కూడా అంటున్నారు...సోషల్ మీడియా సోర్సును బట్టి ఇంక ఇప్పుడు అంతకుమించి చెప్పడం కష్టం.

సరే మరి కొన్ని పోస్టుల ప్రకారం అలా జరిగేది ఆంధ్రప్రదేశ్ లో అనుకుందాం...మరైతే ఇక్కడ ఏం జరగొచ్చు...అదే సోషల్ మీడియాలో దీని గురించి ఏమి రాశారంటే...
తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ 'రేవంత్‌రెడ్డి' ఇంటిపైన, ఆయన బంధువుల ఇంటిపైన ఏ విధంగా అయితే ఐటి దాడులు జరిగాయో అలాగే ఎపిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై, ఇతర ఆస్తులపై దాడులు చేయబోతున్నారని వార్తలు రాశారు. వీటిలో నిజమెంతో...అసలు వీరికి సోర్స్ ఏమిటో తెలియదు...అయితే ఏ పుట్టలో ఏ పాముందో అనే సూత్రాన్ని అనుసరించి అక్టోబర్ 8 న ఏదో జరగనుందనే సోషల్ మీడియా వార్త ను మీకు తెలియజేయడం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+