ఏం చేస్తాం? చంద్రబాబు జాతకమే అంత!!
నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో సీనియర్లుగా ఉంటున్నవారిని కాదని, తన బంధువులు చెప్పారని మొహమాటానికి పోయి కొత్తవారికి సీట్లిచ్చిన తర్వాత కొద్దికాలానికి వారంతా ఏకు మేకవుతున్నారు.
ఏనాడో చాణక్యుడు చెప్పిన ఎన్నో నీతి సూత్రాలు ఈరోజుకు మనందరం పాటిస్తున్నామంటే కాలమాన పరిస్థితులు మారినప్పటికీ ప్రతి సందర్భంలోను, ప్రతి సన్నివేశానికి అవి అతికినట్లు సరిపోతున్నాయి. అందుకే చాణక్యుడు చెప్పి ప్రతి మాట బంగారుబాటలా మారింది. శత్రువునైనా క్షమించవచ్చుకానీ, నమ్మకద్రోహం చేసినవారిని, తిన్నింటి వాసాలు లెక్కించేవారి అంతం చూడాలనేది చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాల్లో ఒకటి. అయితే చంద్రబాబునాయుడు ఉదారవాదా? భోళా శంకరుడా? ప్రజాస్వామ్యవాదా? అనేది రాజకీయ విశ్లేషకులకు స్పష్టంగా తెలియరావడంలేదు. ఎవరినైనా ఇట్టే క్షమించేస్తారు.
నియోజకవర్గాల్లో ఎప్పటి నుంచో సీనియర్లుగా ఉంటున్నవారిని కాదని, తన బంధువులు చెప్పారని మొహమాటానికి పోయి కొత్తవారికి సీట్లిచ్చిన తర్వాత కొద్దికాలానికి వారంతా ఏకు మేకవుతున్నారు. పార్టీలు మారుతున్నారు. మాట్లాడుతున్న భాష తెలుగో, సంస్కృతమో అర్థం కాని రీతిలో చంద్రబాబుపై, పార్టీపై, ఆయన కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్నారు. విమర్శలు అనేకన్నా రాయడానికి వీలులేని పదజాలం ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు. చంద్రబాబు 41 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. ఎంతోమంది ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, లోక్ సభ సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా పనిచేసి, బాబుపై అవాకులు, చెవాకులు పేల్చినవారే.

రాజ్యసభకు ఎంపికైనవారిలో ఒకరిద్దరు మినహా ఎవరూ పార్టీకి అండగా నిలవలేదు. రాజకీయ భిక్షపెట్టిన తండ్రిలాంటి చంద్రబాబు వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించేవారే ఇప్పటి రాజకీయాల్లో ఉన్నారు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు ప్రవేశించినప్పటినుంచి అధినేతగా ఎదిగేంతవరకు, ప్రస్తుతం కూడా ఆయనపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టేవారే కావడం విశేషం. అందుకే.. తమ నాయకుడు చంద్రబాబు జాతకమే అలా ఉంటుందేమో అంటూ తెలుగు తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తుంటారు.












Click it and Unblock the Notifications