దొంగను పట్టించిన వాట్సాప్
గుంటూరు : టెక్నాలజీని ఉపయోగించుకొని చాల పనులను సులువుగా చేసేయవచ్చు. టెక్నాలజీని మంచికి ఉపయోగిస్తే మంచి జరగుతోంది. చెడుకు ఉపయోగిస్తే చెడుఫలితాలు వస్తాయి. వాట్సాప్ ను ఉపయోగించి ఓ దొంగను పట్టుకొన్న ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకొంది. వైద్యులు వినూత్నంగా ఆలోచించి తమ ఆసుపత్రిలో దొంగతనానికి పాల్పడిన మహిళను పట్టుకొన్నారు.
స్మార్ట్ ఫోన్ వాట్సాప్ సౌకర్యం కలిగి ఉంటే చాలు సమాచారాన్ని గుప్పిట్లో పెట్టుకోవచ్చు.అయితే గుంటూరుకు చెందిన ప్రభుత్వాసుపత్రి వైద్యులు మాత్రం తమ ఆసుపత్రిలో దొంగతనానికి పాల్పడిన మహిళను వాట్సాప్ సహయంతో పట్టుకొన్నారు.
అక్టోబర్ 29వ, తేదిన గుంటూరు ప్రభుత్వాసుపత్రికి స్వప్న .శిశు వైద్య విభాగానికి చికిత్స కోసం వచ్చింది.ఆ సమయంలో పీడియాట్రిక్ ఎమర్జెన్సీ విభాగంలో అసిస్టెంట్ ఫ్రోఫెసర్ డాక్టర్ పి ఝాన్సీరాణి విధుల్లో ఉన్నారు. తన పక్కనే నగదు ఉన్న బ్యాగును డాక్టర్ ఉంచారు. అయితే ఈ బ్యాగును గమనించిన స్వప్న అందులో నుండి డాక్టర్ గమనించకుండా 3 వేల రూపాయాలను దొంగిలించింది. కొద్దిసేపటి తర్వాత స్వప్న అక్కడి నుండి జారుకొంది. స్వప్న డబ్బులను దొంగిలించడం అక్కడ ఉన్న సిసి కెమెరాల్లో రికార్డు అయింది.స్వప్న వెళ్ళిన చాల సేపటి తర్వాత తన బ్యాగులో నగదు తక్కువైన విషయాన్ని డాక్టర్ గుర్తించారు.

తన డబ్బు దొంగతనానికి గురైన విషయాన్ని డాక్టర్ ఆర్ ఎం ఓ రమేష్ కు ఫిర్యాదు చేశారు. సిసిటివి పుటేజ్ ను పరిశీలిస్తే స్వప్న అనే మహిళ డాక్టర్ ఝాన్సీ రాణి బ్యాగులో నుండి డబ్బులను దొంగిలించిన విషయం సిసి కెమెరా పుటేజీలో దొరికింది.స్వప్న పోటోను సిసిటివి నుండి సేకరించి ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బందికి పంపారు.ఫోటోలో ఉన్న మహిళ కన్పిస్తే తన వద్దకు తీసుకురావాలని ఆర్ ఎం ఓ సెక్యూరిటీ సిబ్బందికి సూచించాడు. ఈ మేరకు వాట్సాప్ లో ఫోటోతో పాటు మేసేజ్ పెట్టాడు.
స్వప్న కోసం సెక్యూరిటీ గార్డులు అప్రమత్తంగా ఉన్నారు.మంగళవారం నాడు స్వప్న మరోసారి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోకి వచ్చింది. ఈ ఆసుపత్రిలో రద్దీ అధికంగా ఉండే 13వ, నెంబర్ వార్డులో ఆమె తచ్చాడుతూ కన్పించింది.మరోసారి చేతివాటం ప్రదర్శించేందుకు ఆమె సమయం కోసం ఎదురుచూస్తోంది.అయితే సెక్యూరిటీ సిబ్బంది ఆమెను గుర్తించి ఆర్ ఎం ఓ వద్దకు తీసుకెళ్ళారు. గత నెలలో డాక్టర్ బ్యాగు నుండి డబ్బులను దొంగిలించిన విషయాన్ని ప్రశ్నించగా తొలుత బుకాయించిన సిసి కెమెరా పుటేజీ చూపడంతో ఒప్పుకొంది. డాక్టర్ ఝాన్సీ రాణి బ్యాగు నుండి తస్కరించిన 3 వేల రూపాయాలను తిరిగి డాక్టర్ కు స్పవ్న అందించింది.












Click it and Unblock the Notifications