బుడమేరు ముంపు వెనుక - వరద ముందు ఏం జరిగింది..!!
విజయవాడను ముంపు వెనుక ఏం జరిగింది. బుడమేరు అంతలా ముంచెత్తటానికి కారణాలు ఏంటి. ఆకస్మికంగా ఇంత వరద నగరంలోకి ఎలా వచ్చింది. అందరూ దీని వెనుక చెబుతున్న కారణం బుడమేరు. ఆ ఏరు ఇప్పుడు విజయవాడలో లక్షలాది మంది కన్నీరుకు కారణమైంది. నగరాన్ని ముంచెత్తింది. అసలు ఈ వరద వేళ ఏం జరిగింది. అధికారులు ఏం చేసారు. ఎందుకు స్థానికులను అప్రమత్తం చేయలేదు. ఈ చర్చ ఇప్పుడు బాధితుల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది.
బుడమేరు వరద
బుడమేరు అనేది జలవనరుల శాఖ పరిబాషలో ఒక మేజర్ డ్రెయిన్. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో పంట పొలాల్లో మిగులు నీరు ప్రవహించే ఒక వాగు. ఖమ్మం జిల్లాలో పుట్టింది. పలు వాగుల కలయికతో ప్రవహించి విజయవాడ నగరానికి సమీపంగా వెళ్లి కొల్లేరులో కలుస్తుంది. బుడమేరు గరిష్ఠంగా 11,000ల క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహించే సామర్థ్యం ఉంది. అంతకంటే ఈ డ్రెయిన్ సామర్థ్యం లేదు. పోలవరం నుంచి వచ్చే నీటిని కృష్ణానదిలో కలిపేందుకు దీన్ని ఒక అనుసంధాన కాలువగా మలిచారు.

ఆక్రమణలతో
ఖమ్మం ప్రాంతంలోనూ స్థానికంగా భారీ వర్షాలకు ఒక్కసారిగా వరద వచ్చింది. జలవనరుల శాఖ అంచనా ప్రకారం 60,000ల క్యూసెక్కులు పైగా వచ్చింది. ఆదివారం వేకువ జామున బుడమేరు సునామీ తరహాలో విజయవాడ నగరం పైన విరుచుకుపడింది. బుడమేరకు పడ్డ గండ్లు, దాని ధాటికి తెగిపోయిన చెరువులు.. విజయవాడతో పాటు నాలుగైదు పల్లెటూళ్లను కూడా నామరూపాలు లేకుండా చేసింది. విజయవాడలో ఆరున్నర లక్షలాది మందికి నిలువ నీడ లేకుండా చేసింది. సింగ్ నగర్ ప్రాంతాన్ని మింగేసింది. విజయవాడకు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వెలగలేరు రెగ్యులేటర్ ద్వారానే బుడమేరు వరదను నియంత్రిస్తారు.
ఒక్కసారిగా రావటంతో
విజయవాడలోకి రాకుండా ఈ వరదను ఇబ్రహీంపట్నం మీదుగా కృష్ణా నదికి మళ్లిస్తారు. ఒకవేళ కృష్ణా నదిలో వరద, పోటు ఎక్కువగా ఉంటే మాత్రం వరదను విజయవాడలోకి వదులుతారు. శనివారం సాయత్రం బుడమేరులో వేలాది క్యూసెక్కుల వరద పోటెత్తింది. దీంతో వెలగలేరు రెగ్యులేటర్ నుంచి బుడమేరు వరదను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
కృష్ణా నిండుకుండలా ఉండటంతో వరద వెనక్కు తన్ని నగరం పై విరుచుకుపడింది. వరద విడుదల సమయంలో ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేయలేదు. దీంతో, ఆదివారం ఉదయం నిద్ర లేచే సమయానికి బుడమేరు విరుచుకుపడింది. అనేక చెరువులకు, కాలువలకు కొన్ని వందల చోట్ల గండ్లు పడేలా చేసింది. బుడమేరుపరిధిలోని ఆక్రమణలు కూడా ఇందుకు మరో కారణం. అన్నీ కలిసి నగరంలో విధ్వంసం సృష్టించింది.












Click it and Unblock the Notifications