చంద్రయాన్ 3 ప్రయోగం: దక్షిణ ధృవాన్నే ఇస్రో ఎందుకు ఎంచుకుందంటే?

శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్ 2 తర్వాత చంద్రయాన్-3 మూన్ మిషన్‌ను ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. చంద్రయాన్-3లో ల్యాండర్, రోవర్, ప్రొపల్షన్ మాడ్యూల్ ఉన్నాయి. ఈ మూడు సమన్వయంతో పనిచేస్తే ఇస్రో తాజా ప్రయోగం విజయవంతమైనట్లే.

ఈ మిషన్‌లో భాగంగా ఎల్వీఎం-3పీ4 రాకెట్‌తో చంద్రయాన్-3 అంతరిక్ష నౌకను అనుసంధానించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు బుధవారమే పూర్తి చేశారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) రెండో వాహన అనుసంధాన భవనంలో (ఎస్వీఏబీ) 3900 కిలోల పేలోడ్‌ను రాకెట్ శిఖర భాగాన అమర్చారు. ఉపగ్రహాన్ని బెంగళూరులోని యూఆర్ శాటిలైట్ సెంటర్‌లో తయారు చేయగా షార్ కు తీసుకొచ్చాక శాటిలైట్ ప్రిపరేషన్ బిల్డింగ్(ఎస్పీబీ)లో ల్యాండర్, రోవర్ ప్రొపల్షన్ మాడ్యూల్‌తో అనుసంధానించారు.

Whats there to explore on the moons south pole? Why is ISRO keen on exploring it repeatedly?

ఉగ్రహం సుమారు 3,84,000 కిలోమీటర్లు ప్రయాణించి చంద్రుని నుంచి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేరుకుంటుంది. తర్వాత చంద్రుని దక్షిణ ధృవంలోని నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అవుతుందని ఇస్రో తెలిపింది. ఇప్పటి వరకు ఎవరూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధృవాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఇస్రో 2019లో చంద్రయాన్-2 మిషన్‌ను చేపట్టింది. అయితే, చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ఆర్బిటర్ సాఫ్ట్ ల్యాండింగ్ విఫలమైంది. అయినప్పటికీ.. చంద్రుని చుట్టూ ప్రస్తుతం విజయవంతంగా పరిభ్రమిస్తోంది.

ఈ నేపథ్యంలో చంద్రయాన్-2లోని లోపాలను సవరిస్తూ తాజాగా, ఇస్రో చంద్రయాన్-3 చేపట్టింది. సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కాగా, ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా తమ వాహకనౌకలను ల్యాండ్ చేయగలిగాయి. ఈ మైలురాయిన సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలిచేందుకు సిద్ధమైంది. తాజాగా, ప్రయోగం విజయవంతమైతే ఇస్రో చరిత్ర సృష్టించినట్లవుతుంది.

Whats there to explore on the moons south pole? Why is ISRO keen on exploring it repeatedly?

దక్షిణ ధృవంలోని విపరీతమైన శీతల ఉష్ణోగ్రతలు కూడా ఈ ప్రాంతంలో కనిపించే వస్తువులు మిలియన్ల సంవత్సరాలుగా స్తంభింపబడి భద్రపరచబడి ఉండేవని సూచిస్తున్నాయి. అందువల్ల, చంద్రుని ఈ ప్రాంతం నుంచి మట్టి, రాళ్ళు మనకు ప్రారంభ సౌర వ్యవస్థకు సంబంధించిన విషయాలు తెలిసే అవకాశం ఉంది. అంతేగాక, తక్కువ కాంతి ఉన్న ప్రాంతాల్లో పరిశీలించదగిన పరిమాణంలో నీటి అణువులను కనుగొనే అవకాశం ఎక్కువగా ఉంది.

కాగా, చంద్రుని ధ్రువ ప్రాంతం చాలా కష్టతరమైన భూభాగం. దానిలోని కొన్ని ప్రాంతాలు పూర్తిగా చీకటిలో ఉన్నాయి. అక్కడ సూర్యరశ్మి మచ్చ కూడా చేరుకోలేదు. ఇది చాలా చల్లగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు -230 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయి. ఈ పిచ్ చీకటి, విపరీతమైన చల్లని వాతావరణం ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరును చాలా సవాలుగా మారుస్తుంది. దీని పైన, దక్షిణ ధృవం పెద్ద క్రేటర్లతో నిండి ఉంది, కొన్ని వేల కిలోమీటర్లు కూడా విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రయాన్ 3 ప్రయోగం అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+