Dussehra 2023: దసరా 23, 24 తేదీల్లో ఎప్పుడు - తేల్చేసిన పండితులు..!!

అందరూ భక్తితో ఇష్టంగా జరుపుకొనే పండుగ దసరా. మరి..దసరా పండుగ ఎప్పుడు జరుపుకోవాలి. ఈ సారి రెండు రోజులు పండుగ నిర్వహణ పైన భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 23 లేదా అక్టోబర్ 24 రెండు రోజులు పండగు పైన మీమాంస కొనసాగుతోంది. ఈ సమయంలోనే ప్రభుత్వంతో సహా కొందరు పండితులు పండుగ పైన క్లారిటీ ఇస్తున్నారు. విజయదశమి రోజు అధర్మంపై నీతి మరియు అసత్యంపై సత్యం సాధించిన విజయానికి చిహ్నంగా ప్రసిద్ధి చెందింది.

పండుగ ఎప్పుడు
ప్రతి సంవత్సరం ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున విజయదశమి జరుపుకుంటారు. పౌరాణిక విశ్వాసాల ప్రకారం, విజయదశమి రోజున మాత దుర్గా మహిషాసురుడిని వధించగా, శ్రీరాముడు రావణుడిని చంపి, సీతను అతని బారి నుండి విడిపించి. ప్రతి సంవత్సరం విజయదశమి నాడు రావణ, కుంభకర్ణ, ఇంద్రజిత్తుల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. ఈ ఏడాది విజయదశమి తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. విజయదశమి అక్టోబర్ 23నా లేక 24వ తేదీనా అనే సందిగ్ధత కొనసాగుతోంది. వైదిక క్యాలెండర్ ప్రకారం, అశ్వీయుజ మాసం శుక్ల పక్ష దశమి తిథి సోమవారం, అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం 05.44 గంటలకు ప్రారంభమవుతుంది. మంగళవారం, అక్టోబర్ 24 మధ్యాహ్నం 03:14 గంటలకు ముగుస్తుంది.

 Dussehra

నిర్వహణపై సందిగ్ధత
ఈ సంవత్సరం విజయదశమి రవియోగంలో ఉంది. అక్టోబర్ 24వ తేదీ విజయదశమి రోజున ఉదయం 06.27 గంటలకు రవియోగం ప్రారంభమై మధ్యాహ్నం 03.28 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత సాయంత్రం 06:38 నుండి రవియోగం ప్రారంభమై మరుసటి రోజు అక్టోబర్ 25వ తేదీ ఉదయం 06:28 వరకు కొనసాగుతుంది. విజయదశమి నాడు సూర్యాస్తమయం తర్వాత ప్రదోషకాలంలో రావణ దహనం చేస్తారు. ఈ సంవత్సరం రావణ దహనం అక్టోబర్ 24 సాయంత్రం 05.43 నుండి జరుగుతుంది. ఈ సమయం నుండి రావణ దహనం యొక్క శుభ సమయం రెండున్నర గంటల పాటు కొనసాగుతుంది.

రెండు తేదీల్లో రావటంతో
తెలంగాణలో దసరా సెలవును అక్టోబర్ 23కు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేగాక, అక్టోబర్ 24వ తేదీని కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ విద్వత్‌ సభ ఈ నెల 23న దసరా పండుగను నిర్వహించుకోవాలని సూచించింది. విజయవాడ ఇంద్రీకీలాద్రి పైన దసరా వేడుకలు ఈ నెల 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. 23న ఉత్సవాల ఆఖరు రోజున రెండు అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. దీంతో, ప్రముఖ దేవాలయాల్లోనూ 23న విజయ దశమి జరుపుకోవాలని నిర్ణయించారు. ఇదే సమయంలో ఉత్తరాదిలో మాత్రం 24న దసరా నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+