అప్‌సెట్!: పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఇలా వచ్చి అలా వెళ్లిన జూ.ఎన్టీఆర్
హైదరాబాద్: విశాఖలో వచ్చిన హుధుద్ తుఫాను బాధితులకు తమవంతు సాయం చేసేందుకు తెలుగు సినీ పరిశ్రమ ఆదివారం నాడు మేము సైతం కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో అగ్రహీరోలు సందడి చేశారు. అయితే, జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు. ఇది ఇప్పుడు పరిశ్రమలో, బయట చర్చనీయాంశమవుతోంది.
ఈ కార్యక్రమానికి పవన్ వస్తారని ఆయన అభిమానులతో పాటు చాలామంది ఆశించారు. కానీ ఆయన రాలేదు. దీంతో అభిమానులతో పాటు చాలామంది అప్ సెట్ అయ్యారు! ఈ కార్యక్రమానికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు వచ్చారు. మహేష్ బాబు, నాగార్జునలు తమ స్కిట్‌తో అలరించారు.
కానీ, పవన్ కళ్యాణ్ రాకపోవడం పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అనే వ్యాఖ్యలు కొందరి నోట వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి పవన్ హాజరవుతారని అందరు భావించినప్పటికీ, అతను మాత్రం రాలేదని చెబుతున్నారు. ఆయన రాకపోవడంతో అదో ప్రశ్నగా మారిందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ రాకపోవడానికి మరేదైన కారణం ఉందా అని చర్చ సాగుతోందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కొద్దిసేపైనా మేము సైతం కార్యక్రమంలో పాల్గొంటారని పలువురు భావించారు. పవన్ సాయంత్రం వస్తారని ఆర్గనైజర్స్ చెప్పినట్లుగా తెలుస్తోంది.
దీంతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడైనా ఆయన వస్తారని భావించారు. కానీ రాలేదు. హీరో మహేష్ బాబును నటి సమంత ఇంటర్వ్యూ చేసింది. తద్వారా మహేష్ బాబు అలరించారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇలా వచ్చి, కాసేపు ఉండి వెళ్లిపోయారు.
జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణలకు విభేదాలు ఉన్నట్లుగా తరుచూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమానికి హాజరైన జూనియర్ మాత్రం బాలకృష్ణను పొగిడటం విశేషం. బాబాయ్ బాలకృష్ణ పాటను బ్రహ్మాండంగా పాడారని కితాబిచ్చారు.
-
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications