వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యమెక్కడ: బైరెడ్డి, అశోక్ బాబుకు జెఏసి హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Byreddy Rajasekhar Reddy
కర్నూలు: తెలంగాణ బిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వద్దకు వచ్చిందని, ఇంకా సమైక్యాంధ్ర ఎక్కడిదని సమైక్యాంధ్ర పరిరక్షణ పార్టీ అధినేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి గురువారం అన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలు ఇంకా కాంగ్రెసు పార్టీ నేతల మోసపూరిత మాటలను నమ్మవద్దని కోరారు.

రాష్ట్రానికి బిల్లు వచ్చాక కూడా ఇంకా సమైక్యమనడం మభ్యపెట్టడమే అన్నారు. రాయలసీమ ప్రాంత నేతలు సాయంత్రం సమావేశమవడం విడ్డూరమన్నారు. వారు రాయలసీమను విచ్ఛిన్నం చేసేందుకే సమావేశమవుతున్నారా అని ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాంతానికే రాజధానిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 16న రాయలసీమ రణభేరీ నిర్వహిస్తామన్నారు.

అశోక్‌బాబుపై టిజెఏసి ఫైర్

అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ అనుకూలంగా ఓటు వేయాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి పిలుపునిచ్చింది. ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఎక్కువగా మాట్లాడుతున్నారని, ఆయనకు హైదరాబాదులో అడ్డా లేకుండా చేస్తామన్నారు.

విభజనకు టిడిపి వ్యతిరేకం కాదు : యనమల

రాష్ట్ర విభజనకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని మాజీ స్పీకర్ యనమల రామకృష్ణుడు తెలిపారు. గురువారం ఉదయం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో యనమల మాట్లాడుతూ తెలుగు ప్రజలకు సమన్యాయం జరగాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధంగా విభజన ప్రక్రియ జరగడం లేదని ఆయన అన్నారు. అసెంబ్లీ మెజార్టీ అభిప్రాయాన్ని... అటార్నీజనరల్, న్యాయశాఖ సూచనలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాలని యనమల పేర్కొన్నారు.

మరోవైపు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గండ్ర, డికె అరుణలు మాట్లాడుతూ.. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలన్నారు. తెలంగాణ సాధన కోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కలుపుకొని వెళ్తామన్నారు. తెలంగాణపై త్వరగా చర్చకు వచ్చేలా చూస్తామన్నారు. అసెంబ్లీలో తీర్మానం ఉండదని, అభిప్రాయం తెలిపేందుకేనన్నారు.

English summary
Rayalaseema Parirakhana Samithi chief Byreddy Rajasekhar Reddy on Thursday questioned Rayalaseema Congress leaders about United AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X