వైసిపి ప్లీనరీ, టిడిపి కౌంటర్.. ఏ ఛానల్ ఎంతసేపు: ట్రాకింగ్, డేటా రెడీ?
వైసిపి నిర్వహించిన ప్లీనరీపై ఆ పార్టీ అభిమానులతో పాటు టిడిపి వారికి కూడా ఆసక్తి ఉంటుంది. ప్లీనరీలో ఏం జరుగుతోంది, ఏం చెబుతారు.. అనే విషయాలు అందరిలోను మెదులుతాయి.
అమరావతి: వైసిపి నిర్వహించిన ప్లీనరీపై ఆ పార్టీ అభిమానులతో పాటు టిడిపి వారికి కూడా ఆసక్తి ఉంటుంది. ప్లీనరీలో ఏం జరుగుతోంది, ఏం చెబుతారు.. అనే విషయాలు అందరిలోను మెదులుతాయి.
టిడిపికి మహానాడు అయినా, వైసిపికి ప్లీనరీ అయినా, మరో పార్టీ ఆవిర్భావ సభలు అయినా.. ప్రజలు ఆసక్తిగా చూస్తారు. అన్ని టీవీ వాటికి ప్రాధాన్యత ఇస్తాయి. పత్రికలు పతాక శీర్షికల్లో ఇస్తాయి.
ఈ నేపథ్యంలో వైసిపి ప్లీనరీ కవరేజీకి ఏయే టీవ ఎంత సమయం వెచ్చింది? ఎవరు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో తెలిసేలా టిడిపి క్యాంప్ టీవీ చానెళ్ల కవరేజీ తీరును ట్రాకింగ్ చేశారని తెలుస్తోంది.
అంతేకాదు, జగన్‌కు టిడిపి నాయకులు ఇచ్చిన కౌంటర్లను కూడా ఏయే టీవీ ఛానల్ ెలా కవర్ చేసింది అనే అంశంపై కూడా ఓ డేటా ప్రిపేర్ చేశారని ప్రచారం సాగుతోంది. ఈ అంశాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Recommended Video


ట్రాక్ చేశారా?
ఇది టిడిపి ట్రాక్ చేసి, రికార్డు చేసిన సమాచారమేనా అంటే కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు. వాటిని పరిశీలిస్తే మాత్రం తెలుగు తమ్ముళ్లు చేసి ఉంటారనే అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు.

చానళ్ల వారీగా..
చానళల్ వారీగా చూస్తే వైసిపి ప్లీనరీని ఎక్కువగా లైవ్ చూపించింది సహజంగానే సాక్షి టీవీ. చివరలో మాత్రం టీవీ 5 ఉంది. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రికార్డులు చూస్తే... సాక్షి 541 నిమిషాలు, ఎన్టీవీ 218 నిమిషాలు, 10టీవీ 130 నిమిషాలు, టీవీ 9 94 నిమిషాలు, టీవీ 9 94 నిమిషాలు, ఈటీవీ 88 నిమిషాలు, ఏబీఎన్ 59 నిమిషాలు, టీవీ5 29 నిమిషాలు లైవ్ టెలికాస్ట్ చేసింది.

టిడిపి నేతల కౌంటర్ రికార్డ్ ఇలా..
వైసిపి ప్లీనరీపై టిడిపి నేతలు కౌంటర్ ఇచ్చారు. వీటిని కూడా ఆయా ఛానళ్లు ఎంతసేపు ఇచ్చారని లెక్క తీసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. మంత్రులు సోమిరెడ్డి, దేవినేని, కేఈ కృష్ణమూర్తి, కాల్వ శ్రీనివాసులు, కళా వెంకట్రావు, జవహర్, పరిటాల సునీత, ఆదినారాయణ రెడ్డి, ఇతర టిడిపి నేతలు కూడా మాట్లాడారు.

ఏ టీవీ ఛానల్ ఎంతసేపు అంటే
వీరందరు మీడియాతో మాట్లాడారు. మొత్తంగా ఈ నేతల కౌంటర్ లైవ్‌ను ఎన్టీవీ 37 నిమిషాలు, ఏబీఎన్ 28 నిమిషాలు, టీవీ 9 7 నిమిషాలు, 10 టీవీ 3 నిమిషాలు, టీవీ 5 3 నిమిషాలు, ఈటీవీ 63 నిమిషాలు ఇచ్చింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications