ఎన్టీఆర్‌ని కాదని పవన్ వద్దకు బాబు: లోకేష్‌పై పావులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన చేతుల నుండి పార్టీ చేజారిపోకుండా రాజకీయ వారసుడిని సిద్ధం చేస్తున్నారట. యోగా గురువు రాందేవ్ బాబాతో ఆశీస్సులను అందించి నెమ్మదిగా తన కుమారుడు నారా లోకేష్‌కు పార్టీలో కీలక బాధ్యతలను అప్పగించి పార్టీపై పట్టు సాధింప చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారట.
గత కొద్ది రోజులుగా లోకేష్‌కు వివిధ సందర్భాల్లో చంద్రబాబు కొన్ని పార్టీ బాధ్యతలను అప్పగిస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార బాధ్యతను కూడా అప్పగించారు. అంతకుముందు పార్టీ నడిపించాలంటే అవసరమైన ప్రజాసంబంధాల బాధ్యత కూడా అప్పగించారు. ఒక టీవీ చానల్ అధిపతిగా ఇటు పాత్రికేయులతో అటు రాజకీయ నాయకులతో నిరంతరం సంబంధాలు నెరపిన లోకేష్‌కు అంతర్గత బాధ్యతలను కూడా చంద్రబాబు అప్పగించారు.

సుజనా చౌదరి, గరికపాటి మోహన రావు, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ, సిఎం రమేష్ తదితరులు అంతా లోకేష్‌కు అత్యంత సన్నిహితంగా ఉండటంతో పాటు పార్టీ వ్యవహారాలను గుట్టు చప్పుడు కాకుండా చక్కబెడుతున్నారు. సంక్షోభంలో ఉన్న సమయంలో టిడిపికి వారసుడిగా, ఆశాకిరణంగా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్‌ను విజయవంతంగా ఇటు బాలకృష్ణ వర్గం, అటు బాబు వర్గం పక్కన పెట్టేశారంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల ప్రచారానికి పిలవడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపని చంద్రబాబు జనసేన పార్టీ అధ్యక్షులుపవన్ కళ్యాణ్‌ను మాత్రం ఎన్నికల ప్రచారానికి పిలిచేందుకు ఆయన ఇంటికి వెళ్లడం ద్వారా చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారంటున్నారు. ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లోను లోకేష్ జోరు కనిపించింది. తద్వారా వారసుడి పైన చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications