Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్-లోకేష్‌లతో రివర్స్, 'సీఎం' ఎవరు?: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో సస్పెన్స్

2019 ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటింది. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణేనా? మరెవరైనానా? అనే ప్రశ్న అందరి మదిని తొలచివేస్తోంది. అందుకు జనసేనాని వ్యాఖ్యలే కారణమని చెబుతున్నారు.

విజయవాడ: 2019 ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటింది. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణేనా? మరెవరైనానా? అనే ప్రశ్న అందరి మదిని తొలచివేస్తోంది. అందుకు జనసేనాని వ్యాఖ్యలే కారణమని చెబుతున్నారు.

సాధారణంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా లేక ఎన్నికల్లో పోటీ చేసినా.. ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉంటారు. కానీ పవన్ విషయంలో దీనిపై స్పష్టత రావడం లేదని అంటున్నారు.

పూర్తిగా రాజకీయాలు

పూర్తిగా రాజకీయాలు

2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మొన్నటి దాకా ప్రభుత్వాలను నిలదీయడం వరకు మాత్రం ఆగిన పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికల కార్యరంగంలోకి దిగారు. అప్పుడప్పుడు మీటింగులలో ప్రభుత్వాల పైన విమర్శలు గుప్పిస్తున్నారు. తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి.. పూర్తిగా రాజకీయాల పైన దృష్టి సారించనున్నారు.

జగన్, లోకేష్.. పవన్

జగన్, లోకేష్.. పవన్

2014 ఎన్నికల్లో.. కొత్త రాష్ట్రానికి అనుభవమున్న నేత కావాలని చంద్రబాబుకు పవన్ మద్దతు పలికారు. తద్వారా జగన్‌కు అనుభవం లేదని అభిప్రాయపడ్డారు. నిన్న వారసత్వ రాజకీయాలపై మాట్లాడుతూ.. పరోక్షంగా లోకేష్ గురించి చెప్పారని భావిస్తున్నారు. అయితే, అదే అనుభవలేమి పవన్‌కూ ఉంది.

పవన్ వ్యాఖ్యలూ సస్పెన్స్‌కు కారణం

పవన్ వ్యాఖ్యలూ సస్పెన్స్‌కు కారణం

తనకు అధికారం యావ లేదని పవన్ పలుమార్లు చెప్పారు. తాను ప్రజల కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని చెబుతున్నారు. అధికారం ఉంటేనే ప్రజలకు చేయగలుగుతామనే మాటలను తాను విశ్వసించనని చెప్పారు. అంతేకాదు, తనకు రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేదని కూడా కొద్ది రోజుల క్రితం వ్యాఖ్యానించారు

పొత్తు ఖాయమా?

పొత్తు ఖాయమా?

ఈ పరిణామాలన్నింటిని చూస్తుంటే 2019 ఎన్నికల్లో ఇతర పార్టీలతో జనసేన పొత్తు ఖాయమని అర్థమవుతోందని అంటున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కాకపోయే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు. ఇతర పక్షాలు పవన్‌ను సీఎంగా అభ్యర్థిగా చూసినా.. ఆయన వెనక్కి తగ్గే అవకాశాలే ఎక్కువ అంటున్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

పవన్ కళ్యాణ్ వెనక్కి పోతే.. జనసేన లేదా ఆ పార్టీ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు ఉంటారనేది ఆసక్తిగా మారిందని అంటున్నారు. లెఫ్ట్ - కాంగ్రెస్ - జనసేనలు కలిసి పోటీ చేస్తాయని, అప్పుడు పవన్ సోదరుడు చిరంజీవి సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగినా ఆశ్చర్యం లేదంటున్నారు. కలిసి పని చేసే దిశలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. అది పొత్తుగా మారవచ్చు.

తెరపైకి చిరంజీవి

తెరపైకి చిరంజీవి

ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో అవసరం వస్తే తాను పవన్ తరఫున పని చేస్తానని చెప్పారు. తన అన్నయ్య చిరంజీవి కూడా తమ్ముడి కోసం పని చేయాలన్నారు. ఇన్నాళ్లు అన్నయ్య చిరు కాంగ్రెస్‌లో ఉన్నాడని, కాబట్టి తాను కాంగ్రెస్ వ్యక్తినని చెప్పిన నాగబాబు.. ఆ తర్వాత జనసేన వైపు మళ్లారు. అంటే మార్పులు చేర్పులు చోటు చేసుకొని చిరంజీవి తెరపైకి వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+