చిటికెస్తే వాడు: పవన్‌కళ్యాణ్‌పై కెసిఆర్ బూతు పురాణం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోమారు బూతుపురాణం అందుకున్నారు! ఈసారి ఆయన బిజెపి, టిడిపి కూటమికి మద్దతు పలుకుతూ తెలంగాణలో ప్రచారం చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన తన ప్రతాపం చూపారు. శనివారం తెలంగాణలో పర్యటించిన పవన్... తాటతీస్తానంటూ కెసిఆర్ పైన నిప్పులు చెరిగారు. ఆయన వ్యాఖ్యల పైన కెసిఆర్ ఘాటుగా స్పందించారు.

తాను చిటికేస్తే వెయ్యి తునకలు అవుతాడంటూ రెచ్చిపోయారు. వాడి సినిమాలు తాను చూడలేదని, అరేయ్ కెసిఆర్ నీ తాట తీస్తా అంటాడా అంటూ ధ్వజమెత్తారు.
ఎంత ధైర్యమండీ వాడెవదో సినిమా యాక్టరట, వాడి సినిమానే నేను ఇంతవరకు చూడలేదు, వాడు నిన్న వరంగల్‌లో తెలంగాణ గడ్డమీద నిల్చొని అరేయ్ కెసిఆర్ నీ తాట తీస్తా అంటాడా... వీడా, ఒక చిటికె కొడితే పోయి కుంక అయితాడు... నా కొడుకు ఏమనుకుంటున్నాడో, తెలంగాణలో నాతాట తీస్తాడంట, నాలుగు రోజులు పోతే ఎవడి తాట ఎవడు తీస్తాడనే విషయం తెలుస్తుంది,చిటికెన వేలంత సినిమా హీరోగాడు... వాడా నా తాట తీసేది, నన్ను అన్నందుకు నాకు బాధ లేదు. నన్ను రోజుకు పది కుక్కలు తిడుతాయి, చిటికెన వేలడంత లేని సినిమా హీరో మాట్లాడితే, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాజకీయ నాయకుల మీద ఆంధ్రా వాళ్లు... అంటూ కెసిఆర్ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications